తాడేపల్లి: మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తన నివాసంలో పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు కె పార్థసారథి, జోగి రమేష్ పాల్గొన్నారు.