గోపాల్‌పై హత్యాయత్నం దారుణం

దోషులను వెంటనే పట్టుకోవాలి

వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు టీజేఆర్ సుధాక‌ర్‌బాబు

నెల్లూరు: సర్వేపల్లి నియోజ‌క‌వ‌ర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ ఎస్టీ నేత గోపాల్‌పై ప‌చ్చ‌మూక‌ల దాడి దారుణ‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు టీజేఆర్ సుధాక‌ర్‌బాబు మండిప‌డ్డారు. రెండు రోజుల క్రితం గోపాల్ ఇంటికి  వెళ్లి ఆయన భార్య నోరు అదిమి  కత్తులతో దాడి చేసి గొంతు కోయడానికి ప్రయత్నించార‌ని తెలిపారు. గోపాల్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండ‌గా బుధ‌వారం టీజేఆర్ సుధాక‌ర్‌బాబు ఆసుప‌త్రికి వెళ్లి ప‌రామ‌ర్శించారు. అత‌ని ఆరోగ్య ప‌రిస్థితిపై వైద్యుల‌తో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..  “ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. టిడిపీ నేతలు గోపాల్‌ను చంపేయాలనే ఉద్దేశంతోనే ఈ దాడి చేశారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి ప్రజావ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక విధానాలను గోపాల్ ప్రశ్నించినందుకే ఈ దాడి జరిగింది” అని అన్నారు.

“గోపాల్ ఎరుకుల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అతనిపై దాడి చేయడం అనేది సామాజికంగా, రాజకీయంగా పెద్ద నేరం. రాష్ట్రంలో ఎస్టీ, ఎస్సీ కులాల వారికి ప్రశ్నించే హక్కు లేదా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో వస్తోంది.” సోమిరెడ్డి చేసే రాజకీయాలు ప్రజల కోసం కావు. ఆయనకు తెలిసినది దాడులు, అక్రమ కేసులు, హత్యాయత్నాలే. రాజ్యాంగాన్ని మురికి పట్టించే రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలు నిన్ను గెలిపించేది దళితుల గొంతులు కోయడానికి కాదు సోమిరెడ్డి!” అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “నీకు ధైర్యం ఉంటే కాకాణి గోవర్ధన్ సవాల్ స్వీకరించు సోమిరెడ్డి!” అని హెచ్చ‌రించారు. గోపాల్‌పై జ‌రిగిన దాడి ఘ‌ట‌న‌పై వైయ‌స్ఆర్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి  కలత చెందారు. పార్టీ గోపాల్ కుటుంబానికి అండగా ఉంటుంది” అని హామీ ఇచ్చారు.

Back to Top