వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త‌ల‌పై అక్ర‌మ కేసు న‌మోదు చేయ‌డం దారుణం

వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు

ప‌ల్నాడు జిల్లా:  శుభ‌కార్యంలో వైయ‌స్ జ‌గ‌న్ పాట‌లు పెట్టార‌ని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల‌పై అక్ర‌మ కేసు న‌మోదు చేయ‌డం దారుణ‌మి వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు మండిప‌డ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచక పాలన కొనసాగుతోందని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. సోమవారం వినుకొండ ప‌ట్ట‌ణంలోని వైయ‌స్ఆర్‌షీపీ బ్ర‌హ్మ‌నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. వినుకొండ నియోజకవర్గంలో ప్రజలు కనీసం స్వేచ్ఛగా శుభకార్యాలు కూడా చేసుకోలేని పరిస్థితి నెలకొంద‌ని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ముస్లిం మైనార్టీకి చెందిన ఓ వివాహ వేడుక సందర్భంగా సంతోషంగా ఊరేగింపు నిర్వహిస్తుండగా, పోలీసులు అడ్డుకొని “జగన్ పాటలు వేయకూడదు” అని హెచ్చరించి, పెళ్లి మండపం దగ్గరే అరెస్టులు చేసి 11 మంది  కార్యకర్తలపై 307 సెక్షన్ కింద కేసులు నమోదు చేయడం దారుణమ‌ని ఆక్షేపించారు.  రషీద్ హత్య కేసులో సాక్షులుగా ఉన్న వారిని పోలీసులు నిరంతరం బెదిరిస్తూ, చిన్న చిన్న సంఘటనలకే లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టులు, థర్డ్ డిగ్రీ హింసలు కొనసాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు.  పోలీస్ స్టేషన్లో అన్యాయం జరిగినా, ఫిర్యాదు చేసేందుకు వెళ్తే వారిపైనే తిరిగి కేసులు పెడుతున్న సంస్కృతి వినుకొండలో పెరిగిందని విమర్శించారు.  

Back to Top