జ‌య‌మ్మ కుటుంబానికి అండ‌గా నిలిచిన‌ సీఎం వైయ‌స్ జ‌గ‌న్

నంద్యాల: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మ‌రోసారి త‌న మంచిత‌నాన్ని చాటుకున్నారు. నంద్యాల జిల్లా పారుమంచాల గ్రామంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించి తిరిగి వెళ్తున్న సమయంలో ఆ గ్రామానికి చెందిన జ‌య‌మ్మ అనే మ‌హిళ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిశారు. తన కుమారుడు యోగి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని, డయాలసిస్‌ చేయించుకుంటూ ఇబ్బందులు పడుతున్నట్లు సీఎంకి తన కుమారుడి అనారోగ్య సమస్య వివరించింది. అంతేకాక కుమారుడికి అవసరమైన వైద్య సహాయం, పెన్షన్‌ మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని అభ్యర్థించింది.

వెంటనే స్పందించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌.. తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నంద్యాల జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో నంద్యాల జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ శామూన్‌ జయమ్మ కుటుంబానికి అవసరమైన సాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకున్నారు.

Back to Top