తిరుపతి: చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం.. గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి రేణిగుంట చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో సీఎం వైయస్ జగన్‌కు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సుబ్రమణ్యం, ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, అధికారులు, పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. మరికాసేపట్లో సీఎం వైయస్ జగన్ నగరి చేరుకోనున్నారు. ఏప్రిల్–జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యాదీవెన పథకం నిధులను నగరి నుంచి 9,32,235 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.680.44 కోట్లను నేరుగా జమ చేయనున్నారు.