బ‌స్సు దిగి అంబులెన్స్‌లోని పేషెంట్ వ‌ద్ద‌కు సీఎం

ప‌శ్చిమ గోదావ‌రి: మేమంతా సిద్ధం బ‌స్సు యాత్రలో భాగంగా 17 రోజు ఉమ్మ‌డి గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌టిస్తున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌.. మడికి గ్రామంలో త‌న‌ను క‌లిసేందుకు అంబులెన్స్‌లో వచ్చిన పేషెంట్‌ వ‌ద్ద‌కు సీఎం స్వ‌యంగా వెళ్లారు. బ‌స్సు దిగి అంబులెన్స్ వ‌ద్ద‌కు వెళ్లి పెషెంట్ వివరాలు తెలుసుకున్నారు. ఓ ప్రమాదంలో గాయపడి ట్రీట్మెంట్  తీసుకుంటున్న వ్యక్తికి మరింత సహాయం కావాలని బాధితులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను కోరారు. అవసరమైన సహాయం అందిస్తానని సీఎం వారికి హామీ ఇచ్చారు.

Back to Top