గంగమ్మ ఆలయంలో సీఎం వైయస్‌ జగన్‌ ప్రత్యేక పూజలు

తిరుపతి: తిరుమల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతిలోని శ్రీగంగమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌కు ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీగంగమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించిన సీఎం.. అమ్మవారిని దర్శించుకొని, ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. అమ్మ‌వారికి ప్రత్యేక పూజలు నిర్వ‌హించారు. అనంతరం ముఖ్య‌మంత్రికి వేద పండితులు ఆశీర్వ‌చ‌నమిచ్చి తీర్థప్రసాదాలు అందించారు. సీఎం వైయస్‌ జగన్‌ వెంట మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, ఎంపీ గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top