రెండు, మూడు రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేస్తాం

ఉద్యోగులకు మంచి చేయాలనే తపనతో ఉన్నాం

రాష్ట్ర ప్రభుత్వంపై సానుకూల దృక్పథంతో ఉండండి

ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

తాడేపల్లి: ఉద్యోగులకు మంచి చేయాలనే తపనతో ఉన్నాం, ఎంత మంచి చేయగలిగితే.. అంత మంచి చేస్తాం అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌తో ఉద్యోగ సంఘాల భేటీ ముగిసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఆర్థిక శాఖ అధికారులు, ఉద్యోగ సంఘాల తరఫున వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ, బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు, ఇతర నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను సీఎం తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను నోట్‌ చేసుకున్నా. అన్నింటినీ స్ట్రీమ్‌లైన్‌ చేయడానికి అడుగులు ముందుకేస్తున్నాం. మెరుగ్గా చేయగలిగే దిశగా ప్రయత్నం చేస్తాం. ప్రాక్టికల్‌గా ఆలోచించాలని ఉద్యోగ సంఘాలను కోరుతున్నా. రాష్ట్ర ప్రభుత్వం మోయలేని భారాన్ని మోపకుండా ఆలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వంపై సానుకూల దృక్పథంతో ఉండాలని కోరుతున్నా. ఎంత మంచి చేయగలిగితే.. అంత మంచి చేస్తా. ఉద్యోగులకు మంచి చేయాలనే తపనతో ఉన్నాం. రెండు, మూడు రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేస్తాం’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 
 

Back to Top