వైయ‌స్ఆర్ ఆరోగ్య‌శ్రీ‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

తాడేప‌ల్లి: వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితం కార్యక్రమంపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌మీక్షా స‌మావేశం జ‌రిగింది. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైద్య‌, ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. డిసెంబర్‌ 18న ఈ కార్యక్రమం ప్రారంభం నేపథ్యంలో అధికారుల‌తో ప‌లు విష‌యాల‌ను చ‌ర్చించారు. ఈ సమీక్షా సమావేశంలో  వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్ ఎం.టి. కృష్ణబాబు, ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎస్‌. వెంకటేశ్వర్, ఆరోగ్యశ్రీ సీఈఓ డి. కె. బాలాజీ, ఇతర ఉన్నతాధికారులు హాజ‌ర‌య్యారు.

Back to Top