ఖాళీగా ఉన్న సీడీపీఓ పోస్టుల భర్తీకీ సీఎం గ్రీన్‌ సిగ్నల్‌

మహిళా శిశు సంక్షేమ శాఖపై  సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష.

61 సీడీపీఓ పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం

అంగన్‌వాడీలలో మౌలిక సదుపాయాలపై దృష్టి

న్యూట్రిషన్‌ కిట్‌ సరఫరాలో నాణ్యత విషయంలో అస్సలు రాజీ పడొద్దు

అంగన్‌వాడీల నుంచే పిల్లలకు భాషపై గట్టి పునాది అందించాలన్న సీఎం

తాడేప‌ల్లి: ఐసీడీఎస్ శాఖ‌లో ఖాళీగా ఉన్న సీడీపీవో పోస్టుల భ‌ర్తీకి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ్రీన్ సిగ్న‌ల్  ఇచ్చారు. అలాగే 61 సీడీపీవో పోస్టుల భ‌ర్తీకి ముఖ్య‌మంత్రి ఆమోదం తెలిపారు. గురువారం తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అంగన్‌వాడీలలో ఖాళీగా ఉన్న సీడీపీఓ పోస్టుల వివరాలను సీఎంకు అందించారు.

సమీక్ష సందర్భంగా సీఎం ఏమన్నారంటే..:

  • ఖాళీగా ఉన్న సీడీపీఓ పోస్టుల భర్తీకీ సీఎం గ్రీన్‌ సిగ్నల్‌. 61 సీడీపీఓ పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం. 
  • వాటి నియామకాలు ఎపీపీఎస్సీ ద్వారా చేపట్టనున్నట్టు తెలిపిన అధికారులు .
  • సీడీపీఓ పోస్టుల భర్తీని వేగవంతం చేయాలన్న సీఎం.
  • వాటితో పాటు ఇంకా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్న సీఎం. 
  • అంగన్‌వాడీలలో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలన్న సీఎం.
  • నాడు–నేడు కింద చేపడుతున్న పనులను వేగవంతం చేయాలన్న సీఎం
  • సకాలంలో పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్న సీఎం
  • అంగన్‌వాడీలలో చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారంతో పాటు, పిల్లలు వికాపం చెందేలా మంచి వాతావరణాన్ని కల్పించడం ముఖ్యమన్న సీఎం.
  • అంగన్‌వాడీలలో సార్టెక్స్‌ రైస్‌ సరఫరా చేయాలి.
  • న్యూట్రిషన్‌ కిట్‌ సరఫరాలో నాణ్యత విషయంలో అస్సలు రాజీ పడొద్దు.
  • పిల్లలకు ఇచ్చే న్యూట్రిషన్‌ కిట్‌ నాణ్యత కచ్చితంగా అత్యున్నత ప్రమాణాలతో ఉండాలి.
  • అంగన్‌వాడీలలో పిల్లలకు కల్పిస్తున్న సౌకర్యాలలో అన్నింటా క్వాలిటీ పెరగాలి. ఆ ఫలితాలు కనబడాలి. గతంలో కన్నా పిల్లలకు మంచి చేస్తున్నామన్న సంతృప్తి కలగాలి. 
  • అందుకోసం కావాల్సిన వసతులు, సదుపాయాలు పూర్తిగా కల్పించాలి.
  • అంగన్‌వాడీల్లో కరికులమ్‌ (బోధనాంశం) కూడా మారాలి. ఎందుకంటే పిల్లలకు చిన్న వయసులోనే మెదడు తొందరగా పరిణతి చెందుతుంది. ఏ విషయాన్ని అయినా త్వరగా గ్రహించగలుగుతారు. ఇంకా వారికి మంచి అవగాహన కూడా ఏర్పడుతుంది.
  • కరికులమ్‌ మార్పు కోసం అవసరం అయితే ప్రత్యేక అధికారిని నియమించాలి
  • కొత్తగా అందుబాటులోకి వచ్చిన సూపర్‌వైజర్ల సహాయంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాలన్న సీఎం.
  • తనిఖీలు, నాణ్యత, నాడు–నేడు ఈ మూడు అంశాలకు సంబంధించి కచ్చితమైన మార్పు కనిపించాలన్న సీఎం.
  • అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హెల్త్, హౌసింగ్, మహిళా శిశు సంక్షేమ శాఖలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
  • వీటిలో మార్పుల కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి.
  • సిబ్బంది నియామకాలు సహా... ఏ రకమైన అవసరం ఉన్నా ప్రభుత్వం అందించేందుకు సిద్ధంగా ఉంది.
  • అయితే ఆ మేరకు కచ్చితమైన ఫలితాలు కూడా రావాల్సి ఉందన్న సీఎం.
  • సూపర్‌వైజర్స్‌ సక్రమంగా పని చేయాలి. వీరి పనితీరుపైనా పర్యవేక్షణ ఉండాలన్న సీఎం.
  • సూపర్‌వైజర్స్‌ వ్యవస్ధ ద్వారా అంగన్‌వాడీలలో పనితీరు మెరుగవడంతో పాటు నాణ్యత కూడా పెరుగుతుందన్న సీఎం.
  • అంగన్‌వాడీల నుంచే పిల్లలకు భాషపై గట్టి పునాది అందించాలన్న సీఎం.
  • పిల్లలకు ఉత్తమ అభ్యాసాలు ఉండాలన్న ముఖ్యమంత్రి.
  •     మహిళ శిశు సంక్షేమశాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్, సీఎస్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి, మహిళ శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, పాఠశాల విద్యాశాఖ (మౌలిక సదుపాయాలు) కమిషనర్‌ కాటమనేని భాస్కర్, మహిళ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి, పౌర సరఫరాల శాఖ ఎండీ జి.వీరపాండ్యన్, మార్క్‌ఫెడ్‌ ఎండీ రాహుల్‌ పాండే ఇతర ఉన్నతాధికారులు సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.
  •  
Back to Top