తాడేపల్లి: ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఒక ఎంఐజీ లే అవుట్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఆ లే అవుట్స్ ఆదర్శనీయంగా ఉండాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంఐజీ లేఅవుట్లు, క్లీన్ ఆంధ్రప్రదేశ్, టిడ్కో ఇళ్లు, తాగునీరు, అమరావతి ప్రాంత పనులు, రోడ్లు, జగనన్న మహిళా మార్టులపై సమీక్షించారు. అధికారులు ఇచ్చిన నివేదికలు, ఇతర సమాచారం మేరకు పలు కీలక సూచనలు చేశారు. లే అవుట్లు అద్భుతంగా ఉండాలి.. - అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే ఎంఐజీ లే అవుట్స్ నియమాలు, నిబంధనలు, ప్రమాణాలన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలి. - లే అవుట్స్ చూసి ఇతరులు స్ఫూర్తిని పొందాలి. - న్యాయ వివాదాలు, ఎలాంటి ఇబ్బందులు లేని విధంగా క్లియర్ టైటిల్స్ వినియోగదారులకు ఉండాలి. - జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ (ఎంఐజీ లేఅవుట్స్) కోసం ఇప్పటివరకూ 82 అర్బన్ నియోజకవర్గాల్లో సుమారు 6791 ఎకరాల గుర్తింపు. - శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, వైయస్ఆర్ కడప, కర్నూలు, శ్రీ సత్యసాయి, తిరుపతిలో.. 864.29 ఎకరాల్లో లే అవుట్ పనులు.. మే చివరినాటికి సిద్ధం చేస్తామని వెల్లడించిన అధికారులు. క్లీన్ ఆంధ్రప్రదేశ్.. - తడిచెత్త, పొడిచెత్త, ప్రమాదకర వ్యర్థాలు అంటే ఏంటి? అనే విషమయంపై ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి. - ఏ కలర్ డబ్బాలో ఏ చెత్త వేయాలి అనే విషయంపై కరపత్రాలను ప్రతి ఇంటికీ పంచాలి. - ఇప్పటికే 1.12 కోట్ల చెత్త డబ్బాలను పంపిణీచేశామని అధికారులు వివరించారు. - మరో 8 లక్షల చెత్త డబ్బాలను మే 22 నాటికల్లా పంపిణీ చేస్తామన్నారు. - 2,426 ఆటోలు ఇప్పటికే క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో నిమగ్నమయ్యాయి. మిగిలినవి ఈనెలాఖరు నాటికి అందుబాటులోకి వస్తాయన్న అధికారులు. - 1,123 ఈ–ఆటోలు కూడా జూన్ నాటికి అందుబాటులోకి వస్తాయి. - గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్లు డిసెంబరు నాటికి పూర్తయ్యేలా కార్యాచరణ. ప్రతి ఇంటికీ ప్రతిరోజూ తాగునీరు.. - ప్రతిరోజూ ప్రతి ఇంటికీ తాగునీరు అందాలి. - దీనిపై సమగ్ర పర్యవేక్షణ, పరిశీలన ఉండాలి. ఇది జరుగుతోందా? లేదా? అన్నదానిపై ఎప్పటికప్పుడు సమాచారం రావాలి. - తద్వారా దీనివల్ల వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. టిడ్కో ఇళ్లపై సమీక్ష.. గత ప్రభుత్వం రోడ్లు, తాగునీరు, మురుగునీటి శుద్ధిలాంటి లాంటి కనీస మౌలిక సదుపాయాలు లేకుండా టిడ్కో ఇళ్లు ప్లాన్ చేశారు. కానీ, ఈ ప్రభుత్వం వాటిపై దృష్టి పెట్టింది. పెద్ద ఎత్తున సీసీ రోడ్లు, తాగునీటికోసం వాటర్ ట్యాంకులు, మురుగునీటి శుద్ధి సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది. మంచి జీవన ప్రమాణాలు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు. టిడ్కో ఇళ్ల మీద సుమారుగా.. రూ.5, 500 కోట్లు ఈ మూడేళ్లలో ఖర్చుచేసింది ప్రభుత్వం. రోడ్లపై దృష్టి.. - కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి. - ఎక్కడ చూసినా గుంతలులేని రోడ్లు కనిపించాలి. - నాడు – నేడు కింద బాగు చేసిన రోడ్లను హైలెట్ చేయాలి. - జూన్ నాటికి రోడ్ల పనులు పూర్తిచేస్తామని అధికారులు.. సీఎం వైయస్ జగన్‌కు వివరణ ఇచ్చారు. అమరావతి ప్రాంతంలో పనులపై.. - కరకట్ట రోడ్డు విస్తరణ పనులు వేగవంతం అయ్యాయని అధికారులు సమీక్షలో పేర్కొన్నారు. - ఇప్పటికే విద్యుత్ స్తంభాలను తొలగించడంతో పనులు వేగవంతం అవుతాయని చెప్పారు. - సీడ్ యాక్సెస్ రోడ్డు (ఇ–3)పైన కూడా దృష్టిపెట్టామని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారుల క్వార్టర్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టుపై.. - విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టు కోసం వనరుల సమీకరణపై చర్చ. - సమారు 75 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ప్రతిపాదనలు. - మెట్రోరైల్ ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశం. - ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులో భాగంగా కోచ్‌ల డిజైన్, దీంతోపాటు స్టేషన్లలో ఉండే సౌకర్యాలు తదితర వివరాలు సమగ్రంగా సమర్పించాలని సీఎం జగన్ ఆదేశం. - పర్యావరణహిత విధానాలకు పెద్దపీట వేయాలని అధికారులకు సూచన. జగనన్న మహిళా మార్ట్‌లపై.. - మహిళా స్వయం సహాయక సంఘాలతో నడుస్తున్న మహిళా మార్ట్‌లు. - ప్రస్తుతం నడుస్తున్న మహిళా మార్ట్‌లను వివరించిన అధికారులు. - విజయవంతంగా నడుస్తున్నాయన్న అధికారులు.. వీలైనన్ని మహిళా మార్ట్‌లను నెలకొల్పాలని సూచించిన సీఎం జగన్. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ సమీర్ శర్మ, ఉన్నతాధికారులు హాజరయ్యారు.