టెస్టులు పెరిగాయి.. కేసులు తగ్గుతున్నాయి

కోవిడ్‌ పాజిటివిటీ రేట్‌ 8.3 శాతానికి తగ్గడం శుభపరిణామం

కోవిడ్‌ను ఆరోగ్యశ్రీ కింద ట్రీట్‌ చేస్తున్న రాష్ట్రం ఏపీనే

స్పందన కార్యక్రమంలో కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: కరోనా పాజిటివిటీ రేట్‌ 12 నుంచి 8.3 శాతానికి తగ్గడం శుభపరిణామం అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కోవిడ్‌ తగ్గుతుందనడానికి ఇదే నిదర్శనమన్నారు. రాష్ట్రంలో కోవిడ్‌ టెస్టులు పెరిగాయి.. కేసులు తగ్గుతున్నాయని సీఎం వైయస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు. కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్‌ జగన్‌ స్పందన కార్యక్రమం నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వారితో మాట్లాడారు. కోవిడ్‌ నియంత్రణపై సమీక్షించారు. 104 నంబర్‌కు ఫోన్‌ చేస్తే కరోనా టెస్టులు, ఆస్పత్రుల వివరాలు అందాలని అధికారులను ఆదేశించారు. 104కు మాక్‌ కాల్స్‌ చేసి నంబర్‌ పనిచేస్తుందా.. లేదా అని చెక్‌ చేయాలని కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సూచించారు. ఫోన్‌ చేయగానే అరగంటలోనే బెడ్‌ అందుబాటులో ఉందో లేదో చెప్పాలన్నారు. 

కోవిడ్‌ను ఆరోగ్యశ్రీ కింద ట్రీట్‌ చేస్తున్న రాష్ట్రం ఏపీనే అని సీఎం గుర్తుచేశారు. కోవిడ్‌ ఆస్పత్రుల లిస్టు గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. ఎంప్యానల్‌ ఆస్పత్రుల లిస్ట్‌ కూడా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఫుడ్, శానిటేషన్‌ కచ్చితంగా జరగాలన్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి కిట్ల అందకపోతే కలెక్టర్లు, జేసీలదే బాధ్యత అని సూచించారు. కోవిడ్‌ బాధితులను త్వరగా గుర్తించడం వల్లే మరణాల సంఖ్య తగ్గుతోందన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top