ఏ ఒక్క రైతు న‌ష్ట‌పోకూడ‌దు

వ్యవసాయశాఖపై సీఎం వైయస్ జగన్‌ సమీక్ష 

తాడేప‌ల్లి:  ధాన్యం కొనుగోళ్ల‌లో మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా మిగిలిన సేకరణ  కూడా జరగాలని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశించారు. రైతులకు ఎక్కడా నష్టంలేకుండా చూడాలని సూచించారు. ఇప్పుడున్న ప్రక్రియను మరింత బలోపేతం చేయాలన్నారు. రైతులకు మిల్లర్లతో పని ఉండకూడదు, ధాన్యం కొనుగోలు కేంద్రాలవద్ద విక్రయంతోనే రైతుల పని ముగుస్తుంది, ఆతర్వాత అంతా ప్రభుత్వానిదే బాధ్యత అని గుర్తు చేశారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో వ్యవసాయశాఖపై సీఎం వైయస్ జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు.

స‌మీక్ష ముఖ్యాంశాలు ఇలా..

 • ఆహార ధాన్యాల ఉత్పత్తి, సేకరణపై సీఎంకు వివరాలందించిన అధికారులు.
 • 2014–19 మధ్య ఆహార ధాన్యాల సగటు ఉత్పత్తి 153.95 లక్షల మెట్రిక్ టన్నులు.
 • 2019–20 నుంచి 2022–23 ఖరీప్‌ వరకూ సగటు ఆహారధాన్యాల ఉత్పత్తి 166.09 లక్షల మెట్రిక్‌ టన్నులు.
 • రబీకి సంబంధించి ఇ– క్రాప్‌ బుకింగ్‌ ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభిస్తామని వెల్లడించిన అధికారులు.
 • మార్చి మొదటి వారంలో తుది జాబితా వెల్లడిస్తామని వెల్లడి.
 • రబీలో కూడా రైతులకు విత్తనాల పరంగాగాని, ఎరువుల పరంగాగాని ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని సీఎం ఆదేశం.
 • ఆర్బీకేల ద్వారా రైతులకు ఎరువులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించిన సీఎం.
 • దీనికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్న సీఎం.
 • సీఎం ఆదేశాల ప్రకారం ఆర్బీకేల స్థాయిలో కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు, కిసాన్‌ డ్రోన్లు, రైతులకు 50శాతం సబ్సిడీతో వ్యక్తిగత వ్యవసాయ పరికరాల పంపిణీపై ప్రత్యేక దృష్టిపెట్టినట్టు తెలిపిన అధికారులు.
 • ఈ ఏడాది మార్చి, మే–జూన్‌ నెలల్లో ఈ కార్యక్రమాలను అమలు చేస్తామని తెలిపిన అధికారులు.
 • 2వేల డ్రోన్లను పంపిణీ చేసేదిశగా కార్యాచరణ చేశామన్న అధికారులు.
 • తొలివిడతగా రైతులకు 500 ఇస్తామని తెలిపిన అధికారులు.
 • గత డిసెంబరు నుంచే డ్రోన్ల వినియోగంపై శిక్షణ ప్రారంభించామని తెలిపిన అధికారులు.
 • శిక్షణ పొందినవారికి సర్టిఫికెట్లు ఇస్తున్నామన్న అధికారులు.
 • ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ యూనివర్శిటీ ద్వారా శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడి.
 • ఈ శిక్షణ కార్యక్రమాలను మరింత ఉధృతం చేయాలన్న సీఎం.
 • ఉత్తరాంధ్రలో కూడా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశం.
 • ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్‌పై సమీక్ష
 • గతంలో సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్లాంట్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌పై కార్యాచరణ, శాయిల్‌ టెస్టింగ్‌ ప్రతి ఏటా కూడా ఏప్రిల్‌ మాసంలో జరిగేలా చూసుకోవాలన్న సీఎం.
 • టెస్టు అయిన తర్వాత సర్టిఫికెట్లను రైతులకు ఇవ్వాలన్న సీఎం.
 • ఫలితాలు ఆధారంగా ఎలాంటి పంటలు వేయాలన్నదానిపై రైతులకు మార్గనిర్దేశం చేయాలన్న సీఎం.
 • అప్పుడు ఆ పంటకు అవసరమైన పోషకాలను సూచించాలన్న సీఎం.
 • నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేస్తున్న ల్యాబుల్లో వీటి పరీక్షలు వెంటనే జరిగేలా చర్యలు తీసుకుంటామన్న అధికారులు.
 • భవిష్యత్తులో ప్రతి ఆర్బీకేలో కూడా శాయిల్‌ టెస్ట్‌ పరికరాలు ఉంచాలన్న సీఎం. దీనికి సంబంధించి శిక్షణ కార్యక్రమాలను కూడా రూపొందించుకోవాలన్న సీఎం.
 • ప్రతి గ్రామంలో శాయిల్‌ టెస్టింగ్‌ తర్వాత మ్యాపింగ్‌ జరగాలన్న సీఎం. 
 • దీనివల్ల ఎరువులు, రసాయనాల వినియోగం అవసరాలమేరకే జరుగుతుందని, రైతులకు పెట్టబడులు ఆదా అవడంతో పాటు, కాలుష్యం కూడా తగ్గుతుందన్న సీఎం.
 • మాండస్‌ తుపాను వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు సిద్ధంకావాలని అధికారులకు సీఎం ఆదేశం. 
 • సీఎం ఆదేశాల మేరకు సబ్సిడీపై వెంటనే విత్తనాలు అందించామని తెలిపిన అధికారులు.
 • అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా 2023ను ప్రకటించిన నేపథ్యంలో చిరుధాన్యాల వినియోగంపై కార్యాచరణ రూపొందించామన్న అధికారులు.
 • ధాన్యం సేకరణపై సీఎంకు వివరాలు అందించిన అధికారులు
 • సీఎం ఆదేశాల మేరకు మొదటి సారిగా గన్నీబ్యాగుల డబ్బులు, రవాణా ఖర్చులు ఇవన్నీకూడా రైతులకు ఇచ్చామన్న అధికారులు.
 • సీఎం ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలమేరకు ఇప్పటికే రైతులకు 89 శాతం చెల్లింపులు జరిగాయన్న అధికారులు.
 • సంక్రాంతి పండుగ సందర్భంగా రైతులకు చెల్లింపులు చేశామన్న అధికారులు.
 • సంక్రాంతి పండుగ వేళ రైతుల్లో సంతోషాన్ని నింపిందని తెలిపిన అధికారులు.
 • ఇప్పటివరకూ రూ. 5,373 కోట్లు విలువైన ధాన్యాన్ని సేకరించామన్న అధికారులు.
 • ఇంకా సేకరణ కొనసాగుతుందన్న అధికారులు.
 • ఆయా ప్రాంతాల్లో పంటల సీజన్లను దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి రెండోవారం వరకూ సేకరణ కొనసాగుతుందన్న అధికారులు.
 • ఇ–క్రాప్‌ డేటా మేరకు ధాన్యం కొనుగోలు చేయాలన్న చేయాలన్న సీఎం.
 • స్థానిక వీఏఓ నుంచి డీఆర్‌ఓ నుంచి సర్టిఫై చేసిన తర్వాతనే సేకరణ ముగిస్తామన్న అధికారులు.
 • సీఎం ఆదేశాల మేరకు మిల్లర్లు లేకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా తొలిసారిగా ధాన్యం సేకరణ బాగా జరిగిందన్న అధికారులు.
 • మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా మిగిలిన సేకరణ  కూడా జరగాలన్న సీఎం.
 • రైతులకు ఎక్కడా నష్టంలేకుండా చూడాలన్న సీఎం.
 • ఇప్పుడున్న ప్రక్రియను మరింత బలోపేతం చేయాలన్న సీఎం.
 • రైతులకు మిల్లర్లతో పని ఉండకూడదు : సీఎం
 • ధాన్యం కొనుగోలు కేంద్రాలవద్ద విక్రయంతోనే రైతుల పని ముగుస్తుంది:
 • ఆతర్వాత అంతా ప్రభుత్వానిదే బాధ్యత :
 • ఈ అంశాలన్నీ రశీదులమీద స్పష్టంగా పేర్కొనాలన్న సీఎం: 
 • ఏమైనా సమస్యలున్నా, మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయం ఉన్నా ఫిర్యాదు చేయడానికి వీలుగా ఒక నంబర్‌ను ఏర్పాటు చేయాలని, రైతులు ఫిర్యాదు చేయగానే వెంటనే స్పందించాలని అధికారులను ఆదేశించిన సీఎం.
 • ధాన్యం సేకరణ విషయంలో గత ప్రభుత్వం ఏరోజు కూడా రైతులకు ఈ రకంగా మేలు చేయలేదన్న సీఎం
 • గత ప్రభుత్వంతో పోలిస్తే.. సేకరణ కూడా ఈ ప్రభుత్వంలో అధికంగా జరిగిందన్న సీఎం.
 • చివరకు చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా మన ప్రభుత్వమే చెల్లించిందన్న సీఎం.
 • చంద్రబాబు హయాంలో ఏడాదికి ధాన్యం కొనుగోలు సేకరణకు సుమారు రూ.8వేల కోట్లు అయితే మన ప్రభుత్వం హయాంలో ఏకంగా రూ.15వేల కోట్లు సగటున ఏడాదికి ధాన్యం సేకరణకు పెడుతున్నామన్న సీఎం.
 • అంతేకాదు ఎప్పుడూ లేని విధంగా రైతులకు అనుకున్న సమయానికే చెల్లింపులు జరుగుతున్నాయన్న సీఎం.
 • ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, వివక్షలేకుండా, అవినీతికి తావులేకుండా జరుగుతోందన్న సీఎం.
 • ఇంతకుముందు రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన సందర్భం లేదన్న సీఎం
 • అలాంటి ధాన్యాన్నికూడా మనం కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచామన్న సీఎం.
 • రేషన్‌లో కోరుకున్న వారికి చిరు ధాన్యాలు అందించడానికి అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నామన్న పౌరసరఫరాలశాఖ అధికారులు.
Back to Top