ఉగాది నాటికి కొత్త జిల్లాలు.. 

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కీలక ఆదేశాలు..

ఆరోజు నుంచే కలెక్టర్లు, ఎస్పీల కార్యకలాపాలు

జిల్లాల పునర్విభజనపై సీఎం సమీక్ష

అమరావతి: ఉగాది నాటికి కొత్త జిల్లాల నుంచి కలెక్టర్లు, ఎస్పీలు కార్యకలాపాలు సాగించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు సన్నాహకాలు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాల పునర్విభజనపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సీఎం గురువారం సమీక్ష చేపట్టారు. కొత్త జిల్లాల ప్రతిపాదనలు, ప్రాతిపదికలను సీఎంకు అధికారులు వివరించారు. కొత్త జిల్లాల మ్యాపులు, జిల్లా కేంద్రాల నిర్ణయం వెనుక తీసుకున్న ప్రాధాన్యతలను వివరించారు.  అలాగే ప్రతిపాదనలపై వస్తున్న అభ్యంతరాలు, సలహాలు, సూచనలు కూడా నిశితంగా పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే...:
♦కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత... యంత్రాంగం అంతా సమర్థవంతంగా పనిచేయాలి
♦కొత్త జిల్లాలో పని ప్రారంభమైన తర్వాత ఎలాంటి అయోమయం ఉండకూడదు, పాలన సాఫీగా ముందుకు సాగాలి
♦దీనికోసం సన్నాహకాలను చురుగ్గా, వేగంగా, సమర్థవంతంగా మొదలు పెట్టాలి
♦వచ్చే ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు కావాలి
♦ఉగాది నాటికి కొత్త జిల్లాల కలెక్టర్లు , ఎస్పీలు.. ఆయా జిల్లాకేంద్రాల నుంచి పనిచేయాలి
♦ఉద్యోగుల విభజన, మౌలిక సదుపాయాల ఏర్పాటు, కొత్త భవనాలు వచ్చేలోగా యంత్రాంగం పనిచేయడానికి అవసరమైన భవనాల గుర్తింపు.. అన్నిరకాలుగా కూడా సిద్ధం కావాలి
♦కొత్తగా మౌలిక సదుపాయాలు ఏర్పాటయ్యేలోగా ప్రత్యామ్నాయంగా ఏర్పాటు కావాల్సిన భవనాలు తదితర వాటిని గుర్తించాలి
♦అలాగే కొత్త భవనాల నిర్మాణంపైనా ప్రణాళికలను ఖరారు చేయాలి
♦అందుకోసం స్థలాల గుర్తింపుపై దృష్టిపెట్టాలి
♦అభ్యంతరాల విషయంలో హేతుబద్ధత ఉన్నప్పుడు దానిపై నిశిత పరిశీలన చేయాలి
♦నిర్ణయం తీసుకునేముందు వారితో మాట్లాడ్డం అన్నది చాలా ముఖ్యం
♦దీనికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్తున్నాను

ఇప్పుడున్న కలెక్టర్లు, ఎస్పీలే కొత్త జిల్లాలకు...
♦ఇప్పుడున్న జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలనే కొత్త జిల్లాలకు పంపాలని సీఎం ఆదేశం
♦వీరికున్న అనుభవం కొత్త జిల్లాలకు ఉపయోగపడుతుందన్న సీఎం
♦పరిపాలన సాఫీగా సాగడానికి వీరి అనుభవం ఉపయోగపడుతుందన్న సీఎం
♦వీరు కొత్త జిల్లాల్లో మౌలికసదుపాయాలు, పాలన సాఫీగా సాగేందుకు వీలుగా సన్నాహకాలను పరిశీలిస్తారన్న సీఎం
♦స్థానిక సంస్థల (జిల్లాపరిషత్‌ల విభజన) విషయంలో కూడా అనుసరించాల్సిన విధానాన్ని న్యాయపరంగా, చట్టపరంగా పరిశీలించి తగిన ప్రతిపాదనలు తయారుచేస్తామన్న అధికారులు.

ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి (రెవెన్యూశాఖ) ధర్మాన  కృష్ణదాస్, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Back to Top