కాసేపట్లో `వైయ‌స్ఆర్‌ మత్స్యకార భరోసా’ సాయం విడుదల

1,19,875 మత్స్యకార కుటుంబాలకు రూ.119.87 కోట్ల సాయం

తాడేపల్లి: కరోనా సంక్షోభంలోనూ సంక్షేమ పథకాల అమలు పరంపర కొనసాగుతూనే ఉంది. విపత్కర సమయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా.. ప్రజలు ఇబ్బందులు పడకూడదనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే.. వేట నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు మరికొద్దిసేపట్లో ‘వైయస్‌ఆర్‌ మత్స్యకార భరోసా’ సాయం అందనుంది. వరుసగా మూడో ఏడాది వైయస్‌ఆర్‌ మత్స్యకార భరోసా ప‌థ‌కానికి  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి నేడు శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. సీఎం కంప్యూటర్‌ బటన్‌ నొక్కిన వెంటనే 1,19,875 మత్స్యకారుల బ్యాంక్‌ ఖాతాల్లో రూ. 10 వేల చొప్పున నేరుగా జమ కానుంది. మత్స్యకారుల కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 119.87 కోట్లు ఖర్చు చేస్తోంది. నేడు అందబోయే సాయంతో కలుపుకొని మొత్తం రూ.331.81 కోట్లను మత్స్యకార భరోసా కోసం ప్రజా ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం ఖర్చు చేసింది. గతేడాది 2020లో 1,09,231 కుటుంబాలకు సాయం అందించగా.. ఈ ఏడాది ఆ సంఖ్య అధికమైంది. అర్హత కలిగిన వారిని ఒక్కరిని కూడా వదలకుండా మత్స్యకార భరోసా సాయాన్ని అందిస్తున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top