పార్వతీపురం మన్యం జిల్లా:: వరుసగా నాల్గవ ఏడాది జగనన్న అమ్మ ఒడి పథకాన్ని అమలు చేసేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద సీఎం వైయస్ జగన్‌కు డిప్యూటీ సీఎం రాజన్నదొర, స్థానిక ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. సీఎం రాక సందర్భంగా హెలిప్యాడ్ వద్దకు భారీగా జనం చేరుకున్నారు. ముఖ్యమంత్రిని చూసి జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సభా ప్రాంగణానికి బయల్దేరారు. మరి కాసేపట్లో నాలుగో విడత జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని సీఎం వైయస్ జగన్ ప్రారంభించనున్నారు. 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ కానున్నాయి. తద్వారా 1వ తరగతి నుంచి ఇంటర్ చదివే 83,15,341 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. తాజాగా అందచేసే డబ్బులతో కలిపితే ఇప్పటివరకు ఒక్క జగనన్న అమ్మఒడి ద్వారానే రూ. 26,067.28 కోట్లను సీఎం వైయస్ జగన్ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ నాలుగేళ్లలో విద్యా రంగంపై సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం రూ.66,722.36 కోట్లను ఖర్చు చేసింది.