సీ–ఓటర్‌ సర్వే టాప్‌–4 స్థానంలో సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చరిత్రను తిరగరాస్తూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సీ–ఓటర్‌ సర్వేలో టాప్‌–5 మోస్టు పాపులర్‌ సీఎంల జాబితాలో చోటు దక్కింది. దేశ వ్యాప్తంగా ముఖ్యమంత్రుల పనితీరు, ప్రభుత్వ నిర్ణయాల ఆధారంగా మే నెలలో ఈ సర్వే  రూపొందించగా.. సీఎం వైయస్‌ జగన్‌కు 78.01శాతం మంది ప్రజల మద్దతు లభించింది. దీంతో మోస్టు పాపులర్‌ సీఎంలలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నాలుగో స్థానంలో నిలిచారని సీ–ఓటర్‌ సర్వే  నివేదికలో తెలిపింది. పాలకపగ్గాలు స్వీకరించిన తొలి ఏడాదిలోనే అనేక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపింది. తొలి స్థానంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్, తరువాతి రెండు స్థానాల్లో ఛత్తీస్‌ఘడ్, కేరళ ముఖ్యమంత్రులు నిలిచారు. 

Back to Top