ఏపీ హైకోర్టు సీజే ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వంలో పాల్గొన్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

విజయవాడ: ఏపీ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ న‌జీర్ జ‌స్టిస్‌ ధీర‌జ్ సింగ్ ఠాకూర్‌తో ప్రమాణం చేయించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఏపీ హైకోర్టు సీజేగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ ధీర‌జ్‌సింగ్ ఠాకూర్‌ని సీఎం వైయ‌స్ జగన్ ఘ‌నంగా స‌న్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బూడి ముత్యాలనాయుడు, తానేటి వనిత, అంబటి రాంబాబు, మండలి చైర్మన్ కొయ్యే మోసేన్ రాజు, డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం, హైకోర్టు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Back to Top