మ‌న పిల్లలు జాతీయ స్థాయిలో రాణించేలా చ‌ర్య‌లు

బాల‌ల దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

తాడేప‌ల్లి: దేశ తొలి ప్రధాని పండిట్ జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ జ‌యంతి సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆయ‌న‌కు ఘన నివాళులు అర్పిస్తూ..రాష్ట్రంలోని బాలబాలికలందరికీ బాల‌ల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 
మ‌నం మ‌న పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి చ‌దువు. ఆ దిశగా అడుగులు వేస్తూ, ప్రపంచస్థాయి విద్యకు పెద్దపీట వేస్తూ, ఇంగ్లీష్ మీడియం బోధనను తీసుకువ‌చ్చాం. మ‌న పిల్లలు జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లో క్రీడ‌ల‌కు ప్రాధాన్యత పెంచాం. 
అంగన్‌వాడీల నుంచి కాలేజీల వ‌ర‌కు ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాం. దేశ తొలి ప్రధాని పండిట్ జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ జ‌యంతి సంద‌ర్భంగా ఆయనకి ఘన నివాళులు. మరియు రాష్ట్రంలోని బాలబాలికలందరికీ బాల‌ల దినోత్సవ శుభాకాంక్షలు అంటూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్ చేశారు.

Back to Top