శాస్త్రవేత్తల కృషి పట్ల దేశం గర్విస్తోంది

చంద్రయాన్‌-2 శాస్త్రవేత్తలను అభినందించిన సీఎం వైయస్‌ జగన్‌
 

అమరావతి: ఇస్రో శాస్తవేత్తల కృషి పట్ల దేశం గర్విస్తోందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. చంద్రయాన్‌-2 శాస్త్రవేత్తల కృషిని సీఎం వైయస్‌ జగన్‌ ప్రశంసించారు. శాస్త్రవేత్తల నిర్విరామ కృషిని అభినందిస్తూ సీఎం వైయస్‌ జగన్‌ ట్విట్‌ చేశారు. లక్ష్యాన్ని చివరి దశ వరకు చేరుకున్నామని,శాస్త్రవేత్తల కృషి పట్ల దేశం గర్విస్తోందన్నారు.ఈ ఆటంకం రాబోయే విజయానికి నాంది కాబోతుందన్నారు.ఈ సమయంలో ఇస్రో బృందానికి జాతి అండగా నిలబడిందన్నారు.
చంద్రయాన్-2 ప్రయోగం కీలక దశలో సాంకేతిక సమస్యలు తలెత్తి విక్రమ్ ల్యాండర్ నుంచి సంబంధాలు తెగిపోవడంతో దేశ ప్రజలు, శాస్త్రవేత్తలు నిరాశలో కూరుకుపోయారు.  శాస్త్రవేత్తల నిర్విరామ కృషిని వైయస్‌ జగన్‌ అభినందించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top