న‌ల‌భై ఏళ్ల అనుభ‌వం ఉన్నా రూల్స్ పాటించాల్సిందే

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి
 

అమ‌రావ‌తి: చ‌ట్ట‌స‌భ‌లో ఎవ‌రైనా రూల్స్ పాటించాల్సిందే అని, 40 ఏళ్ల అనుభ‌వం ఉన్నా రూల్స్ రూల్సే అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. జీరో అవ‌ర్‌లో టీడీపీ స‌భ్యులు సీట్ల విష‌యంలో గంద‌ర‌గోళం సృష్టించ‌డం ప‌ట్ల వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్పందించారు. ఆయ‌న మాట్లాడుతూ..స్పీక‌ర్ అనుమ‌తితోనే అనుబంధ ప్ర‌శ్న వేయ‌వ‌చ్చు అన్నారు. రూల్స్ ప్ర‌కారం సీట్ల కేటాయింపులు జ‌రిగాయ‌ని తెలిపారు. కేటాయించిన సీట్ల‌లో కూర్చోవాల‌ని స్పీక‌ర్ ఆదేశించార‌ని తెలిపారు.ప్ర‌తీదీ కాంట్ర‌వ‌ర్సీ చేయ‌డం చంద్ర‌బాబుకు త‌గ‌ద‌ని హిత‌వు ప‌లికారు. సానుభూతి కోసం ప్ర‌తిప‌క్ష నేత పాకులాడ‌టం మంచిది కాద‌ని సూచించారు. తొలిసారిగా ఎమ్మెల్యే అయినా, ఆరోసారి ఎమ్మెల్యే అయినా ఎవ‌రైనా చ‌ట్ట‌స‌భ‌లోనే కూర్చుంటార‌ని చెప్పారు. 40 ఏళ్ల అనుభ‌వం ఉన్న వ్య‌క్తి అయినా రూల్స్ పాటించాల్సిందే అని పేర్కొన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top