టెక్‌ మహీంద్రా ఎండీ, సీఈఓ సీపీ గుర్నానితో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ భేటీ

అమ‌రావ‌తి:  దావోస్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సోమ‌వారం సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి టెక్‌ మహీంద్రా ఎండీ, సీఈఓ సీపీ గుర్నానితో భేటీ అయ్యారు.  విశాఖపట్ట‌ణాన్ని మేజర్‌ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సంకల్పంతో ఉన్నారు.
నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడులు పెట్టాలని ఆయన గుర్నానిని కోరారు. ఆర్టిఫియల్‌ ఇంలెటిజెన్స్‌కు ప్రధాన కేంద్రంగా  విశాఖపట్నాన్ని తీర్చిద్దాలన్నారు. ఈ కల సాకారానికి ఏపీతో కలిసి రావాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ఆహ్వానించారు.
ముఖ్యమంత్రిగారి విజ్ఞప్తి మేరకు ఆంధ్రా వర్శిటీ కలిసి పనిచేయాలని మ‌హీంద్రా ఎండీ నిర్ణయించుకున్నారు. నైపుణ్యాలను పెంచేందుకు, హైఎండ్‌ టెక్నాలజీపై వచ్చే మూడు నెలల్లో యూనివర్శిటీతో కలిసి ప్రత్యేక పాఠ్యప్రణాళికను రూపొందిస్తామ‌ని గుర్నాని తెలిపారు.అనంత‌రం దస్సాల్ట్‌ సిస్టమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెశిడెంట్‌ ఫ్లోరెన్స్‌ వెర్జలెన్‌తో సీఎం  స‌మావేశ‌మై చ‌ర్చించారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top