ఇది రైతు ప‌క్ష‌పాత ప్ర‌భుత్వం

‘వైయ‌స్ఆర్‌‌ జలకళ’ ప‌థ‌కం ప్రారంభోత్స‌వంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

అర్హులైన రైతులంద‌రికీ ఉచితంగా బోర్లు

చిన్న, సన్నకారు రైతులకు బోర్‌తో పాటు ఉచితంగా మోటార్లు

గ‌త ప్ర‌భుత్వ బ‌కాయిల‌ను మ‌న ప్ర‌భుత్వ‌మే చెల్లించింది

ఉచిత విద్యుత్‌పై అబ‌ద్ధాలు చెప్ప‌డానికి సిగ్గు ఉందా అని ప్ర‌శ్నించండి

త‌ప్పుడు ప్ర‌చారం చేసే వారిని నిల‌దీయండి

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం రైతు ప‌క్ష‌పాతి అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఉధ్ఘాటంచారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలే కాకుండా అంత‌కంటే ఎక్కువ‌గా రైతుల‌కు మేలు చేసే కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి రైతుల కోసం ఒక అడుగు ముందుకు వేస్తే..ఆయ‌న కుమారుడిగా మ‌రో రెండు అడుగులు ముందుకు వేస్తున్నాన‌ని గ‌ర్వంగా చెప్పారు. వైయ‌స్ఆర్ జ‌ల‌క‌ళ ద్వారా అర్హులైన రైతులంద‌రికీ ఉచితంగా బోర్లు వేయ‌డ‌మే కాకుండా స‌న్న‌, చిన్నకారు రైతుల‌కు మోటార్లు కూడా ఉచితంగా అంద‌జేస్తామ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వ‌రాల జ‌ల్లు కుర‌పించారు. సీఎం క్యాంపు కార్యాల‌యంలో సోమ‌వారం సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వైయ‌స్ఆర్ జ‌ల‌క‌ళ ప‌థ‌కాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, క‌లెక్ట‌ర్లు, రైతుల‌తో ముఖాముఖిగా మాట్లాడారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఏమ‌న్నారంటే..

 రైతుల‌ కోసం మ‌నంద‌రి ప్ర‌భుత్వం మ‌రో అడుగు ముందుకు వేసింది. ఎన్నిక‌ల నాడు ఇచ్చిన మాట‌ను నెర‌వేర్చుకుంటూ ఆ రోజు నా పాద‌యాత్ర‌లో రైతుల క‌ష్టాల‌ను నా క‌ళ్ల‌తోనే చూశాను. క‌చ్చితంగా తోడుగా ఉంటాన‌ని ఆ రోజు మాట‌ ఇచ్చి..ఈ రోజు దాదాపుగా 16 నెల‌లు కావొస్తున్న మ‌న ప్ర‌భుత్వం ఈ మాట‌ను నెర‌వేర్చుతున్నాను. ఈ రోజు 163 బోర్లు..నియోజ‌క‌వ‌ర్గానికి ఒక్కొక్క‌టి చొప్పున కేటాయిస్తున్నాం..ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఇస్తున్నామంటే దేవుడి ద‌య‌, మీ  అంద‌రి చ‌ల్ల‌ని దీవెన‌లే. 

ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌డం చాలా సంతోషంగా ఉంది. పెట్టుకున్న న‌మ్మ‌కానికి ఏమాత్రం న‌ష్ట జ‌రుగ‌కుండా ఇంత పెద్ద కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుడుతున్నాం. బోరు లేని అన్న‌దాత‌ల‌కు అండ‌గా నిల‌బ‌డుతూ..రాష్ట్రంలో 2 ల‌క్ష‌ల బోర్లు త‌వ్వించ‌డ‌మే కాకుండా, కేసీంగ్ పైపులు కూడా ఇచ్చే కార్య్ర‌మానికి శ్రీ‌కారం చూడుతున్నాం. ఇందుకు రూ.2,400 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నామ‌ని గ‌ర్వంగా చెబుతున్నాను.

ఎన్నిక‌ల మేనిఫెస్టోలో చేర్చిత దానికంటే అధనంగా చిన్న స‌న్న‌కారు రైతుల‌కు అద‌నంగా మోట‌ర్లు కూడా ఏర్పాటు చేస్తున్నామ‌ని హామీ ఇస్తున్నాం. మిగిలిన రైతుల‌కు క‌చ్చితంగా బోర్లు వేయిస్తాం. చిన్న, స‌న్న‌కారు రైతుల కోసం ఈ ప‌థ‌కంలో చిన్న మార్పులు  తెస్తున్నాం. ఇందుకు మ‌రో రూ.1600 కోట్లు అద‌నంగా ఖ‌ర్చు అవుతుంది. దాన్ని కూడా భ‌రించ‌డానికి సిద్ధ‌ప‌డ్డాను. ఇందుకోసం ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో ఒక బోర్ రిగ్గు ఏర్పాటు చేశాం. రైతులు ఆన్‌లైన్ ద్వారా న‌మోదు చేసుకోవ‌చ్చు. లేదా వాలంటీర్ల స‌హ‌కారంతో గ్రామ స‌చివాల‌యాల్లో కూడా ఉచితంగా త‌మ పొలాల‌ల్లో బోర్లు తవ్వించుకోవ‌చ్చు. ఇక్క‌డ హైడ్రో జియాలాజిక‌ల్ స‌ర్వే ప్ర‌కారం శాస్త్రియ ప‌ద్ధ‌తిలో బోరు బావి త‌వ్వే స్పాట్ ఎంపిక చేస్తారు. 

ఒక బోరు ఫెయిలైతే మ‌రోక ప్ర‌య‌త్నం..

అవ‌స‌ర‌మైన రైతుకు ఉచితంగా ఒక బోరు ఏర్పాటు చేస్తాం. అది ఫెయిల్ అయితే మ‌రో ప్ర‌య‌త్నం కూడా చేస్తాం. ఒక బోరు రైతుల జీవితాలు ఎలా మార్చుతాయ‌న్న‌ది ఉజ్జాయింపుగా ఎంత ఖ‌ర్చు అవుతుంద‌ని చూస్తే..దాదాపుగా ఏడున్న‌ర హెచ్ పీ అంటే..గంట‌కు ఐదు యూనిట్లు ..రోజుకు 45 యూనిట్లు అవుతుంది. మ‌న‌కు యూనిటు రూ.6.87 పైస‌లు అవుతుంది. నెల‌కు రూ.9740 ఆవ‌రేజ్‌గా ప్ర‌భుత్వం రైతుకు బోరు ద్వారా స‌హాయం చేస్తోంది. ఈ ప‌థ‌కానికి మెరుగులు దిద్దుతూ అడుగులు ముందుకు వేస్తాం. ల‌క్ష‌ల మందికి నీరు, మ‌రింత మందికి ఆహార భ‌ద్ర‌త ల‌భిస్తోంది. 

ఉచిత విద్యుత్‌పై త‌ప్పుడు ప్ర‌చారం న‌మ్మొద్దు..

మ‌న ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చేలోగా రూ.8655 కోట్లు విద్యుత్ బ‌కాయిలు పెట్టారు. ఉచిత విద్యుత్ బ‌కాయిలు చంద్ర‌బాబు క‌ట్ట‌కుండా అన్యాయం చేశారు. రైతుల కోసం చిరున‌వ్వుతోనే ఆ బ‌కాయిలు చెల్లించాం. మ‌నం అధికారంలోకి వ‌చ్చిన నాటికి ఉచిత విద్యుత్‌ను ఇచ్చేందుకు స‌మీక్ష చేస్తే..ఆశ్చ‌ర్యం క‌లిగించే అంశం ఏంటంటే కేవ‌లం 58 శాతం ఫీడ‌ర్లు మాత్ర‌మే అందుబాటులో ఉండేవి. మ‌నం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ప‌గ‌టి పూట రైతుల‌కు ఉచిత విద్యుత్ ఇవ్వాలంటే మ‌న ప్ర‌భుత్వం రూ.1700 కోట్లు ఖ‌ర్చు చేసి ఈ ఖ‌రీఫ్‌కు ఫీడ‌ర్ల కేపాసిటీ పెంచుతున్నాం. ఉచిత విద్యుత్‌కు మీట‌ర్లు బిగించ‌డం గురించి ర‌క‌ర‌కాలుగా, విచిత్ర‌మైన వాద‌న‌లు చేస్తున్నారు. ఉచిత విద్యుత్‌కు మీట‌ర్లు బిగించ‌డం అంటే లోడ్ తెలుసుకుని, మోట‌ర్లు, ట్రాన్స్‌ఫార్మ‌ర్లు కాలిపోకుండా తెలుసుకోవ‌చ్చు. మ‌రో మేలు ఏంటంటే..క‌రెంటు స‌ర‌ఫ‌రా ఎంత ఓల్టేజ్‌లో జ‌రుగుతుంద‌న్న‌ది తెలుసుకోవ‌చ్చు. దీనివ‌ల్ల నాణ్య‌మైన క‌రెంటు అందించ‌వ‌చ్చు. నాణ్య‌మైన ఉచిత విద్యుత్‌ను రైతుకు హ‌క్కుగా ఇవ్వ‌గ‌లిగితే..క‌రెంటు అధికారుల‌ను రైతులు నిల‌దీయ‌వ‌చ్చు. ఎక్క‌డా కూడా రైతు ఒక్క పైసా క‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. మ‌రో 30 ఏళ్లు ఉచిత విద్యుత్ ఇవ్వ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం. దీనికి తోడు సోలార్ ప‌వ‌ర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం. యూనిట్ రూ.2.50 ఖ‌ర్చుతో సోలార్ విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తాం. దీని వ‌ల్ల ప్ర‌భుత్వానికి భారం కాదు. రైతులు ఒక్క పైసా కూడా క‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. 

రైతుల‌కు తోడుగా ఉంటాం..

మ‌న ప్ర‌భుత్వం వ‌చ్చాక ప్ర‌తి ఏటా రైతు భ‌రోసా కింద రూ.13,500 రైతు ఖాతాలో జ‌మ చేస్తున్నాం. మ‌న రాష్ట్రంలోని 50 ల‌క్ష‌ల మందికి దాదాపుగా 80 శాతం పెట్టుబ‌డి కింద ఇస్తున్నాం. పెట్టుబ‌డి ఖ‌ర్చు త‌గ్గి రైతు సంతోషంగా ఉన్నారు. రైతుల‌కు సున్నా వ‌డ్డీ కింద రుణాలు, పంటల బీమాకు ప్రీమియం కూడా చెల్లిస్తున్నాం. అక్వా రైతుల‌కు తోడుగా ఉన్నాం. పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర‌లు క‌ల్పిస్తున్నాం. రైతుల పంట‌ల‌ను ఆర్‌బీకేల ద్వారా కొనుగోలు చేస్తున్నాం. ట్రాక్ట‌ర్ల రోడ్డు ట్యాక్సీలు ర‌ద్దు చేస్తున్నాం. నాణ్య‌మైన విత్త‌నాలు అందించేందుకు ఆర్‌బీకే సెంట‌ర్ల‌లో ప‌రీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఈ-క్రాపింగ్ ద్వారా రైతుల ఇంటి వ‌ద్ద‌కే వ‌చ్చి పంట కొనుగోలు చేసేలా చూస్తున్నాం. మ‌న ప్ర‌భుత్వం రాబోయే రోజుల్లో ఆర్‌బీకేల వ‌ద్దే గోడౌన్లు క‌ట్ట‌బోడుతున్నాం. గ్రేడింగ్ ప్రైమ‌రీ వ్య‌వ‌స్థ‌ను గ్రామ స్థాయి వ‌ద్ద‌కే తీసుకెళ్తున్నాం. ఈ-మార్కెటింగ్ వ్య‌వ‌స్థ‌ను ఆర్‌బీకేల‌తో అనుసంధానం చేస్తున్నాం. మండ‌ల స్థాయిలో కోల్డు స్టోరేజీ, నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నాం. ప్ర‌తి గ్రామంలో జ‌న‌తా బ‌జార్ ఏర్పాటు చేస్తున్నా. ఈ జ‌న‌తా బ‌జార్ల‌లో రైతులు పండించే ప్ర‌తిదీ దొరుకుంది. రైతుల‌కు అన్నిర‌కాలుగా మంచి జ‌రిగే కార్య‌క్ర‌మాలు రాబోయే రోజుల్లో చేప‌డుతున్నాం. 

సిగ్గుందా అని నిల‌దీయండి..

ఇటువంటి ప‌రిస్థితిలో ఉచిత విద్యుత్‌కు డ‌బ్బులు వ‌సూలు చేస్తుంద‌ని ఎవ‌రైనా చెబితే..రైతులే అలాంటి వారిని ప్ర‌శ్నించండి. ఇలాంటి అబ‌ద్ధాలు చెప్ప‌డానికి సిగ్గు ఉందా అని నిల‌దీయాలి. విష ప్ర‌చారం చేస్తూ రైతుల‌కు మంచి జ‌రుగ‌కుండా అడ్డుప‌డుతున్న వారిని నిల‌దీయండి.ఇటీవ‌ల టీడీపీకి చెందిన ఒక పేప‌ర్లో నీటి ప‌న్ను పెంచుతున్న‌ట్లు క‌థ‌నం రాశారు. ఇలాంటి త‌ప్పుడు క‌థ‌నాల‌ను ఖండించండి. ఇంత దారుణంగా అబ‌ద్ధాలు చెబుతున్నందుకు మీకు సిగ్గుందా అని అడ‌గండి.  మ‌న ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత రూ.960 కోట్లు ధాన్యం బ‌కాయిలు చెల్లించాం.  రూ.384 కోట్లు విత్త‌నాల స‌బ్సిడీ బ‌కాయిలు కూడా మ‌న‌మే చెల్లించాం. రూ.8658 కోట్లు విద్యుత్ బ కాయిలు కూడా మ‌న ప్ర‌భుత్వ‌మే క‌ట్టింద‌ని మీ బిడ్డ‌గా స‌గ‌ర్వంగా చెబుతున్నాను. రైతుల‌కు ఎప్పుడు కూడా అన్యాయం చేయ‌ద‌ని, ఇది రైతు ప‌క్ష‌పాత ప్ర‌భుత్వ‌మ‌ని గ‌ర్వంగా చెబుతున్నాను. త‌ప్పుడు ప్ర‌చారాన్ని రైతులు న‌మ్మొద్దు. ఈ కార్య‌క్ర‌మం ద్వారా రైతుల‌కు మంచి జ‌ర‌గాల‌ని మ‌న‌సారా మంచి జ‌ర‌గాల‌ని దేవున్ని కోరుతున్నా... 

తాజా వీడియోలు

Back to Top