నేడు తూర్పుగోదావరిలో సీఎం వైయ‌స్‌ జగన్‌ పర్యటన 

బిర్లా గ్రూప్‌ కాస్టిక్‌ సోడా యూనిట్‌ను ప్రారంభించనున్న వైయ‌స్‌ జగన్‌ 

అమరావతి : ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. బిక్కవోలు మండలం బలభద్రపురంలో బిర్లా గ్రూప్‌ కాస్టిక్‌ సోడా యూనిట్‌ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం వైయ‌స్‌ జగన్‌తో పాటు ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమార మంగళం బిర్లా హాజరు కానున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు సీఎం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, 11 గంటలకు బలభద్రపురం చేరుకుంటారు. కుమార మంగళం బిర్లాతో కలిసి గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ కాస్టిక్‌ సోడా ప్లాంట్‌ను సందర్శిస్తారు. ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం 12.40 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.  

Back to Top