వైయ‌స్ఆర్ జిల్లా పర్యటనకు బయలుదేరిన సీఎం వైయ‌స్ జగన్‌

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైయ‌స్ఆర్ జిల్లా పర్యటనకు బయలుదేరారు. డిసెంబరు 2, 3వ తేదీల్లో జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

నేటి పర్యటన ఇలా.. 
ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఉదయం 11.00 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు . ఇక్కడి నుంచి బయలుదేరి 11.50 గంటలకు లింగాల మండలంలోని పార్నపల్లె వద్ద సీబీఆర్‌ రిజర్వాయర్‌ వద్దకు చేరుకుంటారు.

12.00 నుంచి 12.30 గంటల వరకు బోటింగ్‌ జెట్టిని ప్రారంభిస్తారు. అనంతరం  వైయ‌స్ఆర్ లేక్‌ వ్యూ పాయింట్‌కు చేరుకుని 12.40 నుంచి 1.00 గంట మధ్యలో వైయ‌స్ఆర్ లేక్‌ వ్యూ రెస్టారెంట్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు లింగాల మండల నాయకులతో మాట్లాడతారు. అంతేకాకుండా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఇడుపులపాయలోని గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రి అక్కడ బస చేస్తారు.

Back to Top