‘పోలీస్‌ డ్యూటీ మీట్‌’ ప్రారంభించిన సీఎం

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలీస్‌ డ్యూటీ మీట్‌ను ప్రారంభించారు. తాడేప‌ల్లిలో సీఎం క్యాంపు కార్యాల‌యం నుంచి వ‌ర్చువ‌ల్ విధానం ద్వారా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ పోలీస్ డ్యూటీ మీట్‌ను ప్రారంభించారు. రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పర్యవేక్షణలో తిరుప‌తిలో డ్యూటీ మీట్‌ జరుగుతుంది. ఈ మీట్‌కు 13 జిల్లాల పోలీస్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం మొదటిసారిగా ఏపీ పోలీస్‌ డ్యూటీ మీట్‌ నిర్వహిస్తున్నారు. పోలీస్‌ సేవలను తెలుపుతూ ప్రజలకు చేరువకావాలనే లక్ష్యంతో ఈ మీట్‌ను చేపట్టారు. సైబర్, మహిళా చట్టాలు, పోలీస్‌ సేవలపై అవగాహన కార్యక్రమాలు, పోటీలు నిర్వహిస్తారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top