8 నెలల బాబుకు తన పెన్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన సీఎం వైయ‌స్ జగన్‌

అంబేద్కర్‌ కోనసీమ జిల్లా: వరద బాధితుల పరామర్శ కోసం ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. డా.బీ.ఆర్‌. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకోంది.  పుచ్చకాయలవారి పేటలో వరద బాధితులను సీఎం వైయ‌స్ జగన్‌ పరామర్శించారు. నక్కా విజయలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన స‌మ‌యంలో ఆమె కుమారుడిని సీఎం వైయ‌స్ జగన్ చంక‌నెత్తుకోగా..అ బాలుడు సీఎం జేబులోని పెన్ను తీసుకునే ప్ర‌య‌త్నం చేశాడు. గ‌మ‌నించిన ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌.. 8 నెలల బాబుకు తన పెన్‌ గిఫ్ట్‌గా ఇచ్చి ఆశీర్వ‌దించాడు. దీంతో ఆ బాలుడి త‌ల్లిదండ్రుల ఆనందానికి అవ‌ధులు లేవు. అలాగే శిబిరాల్లో బాగా చూసుకున్నారా అంటూ బాధితులను సీఎం వైయ‌స్ జగన్ అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌కు ఎన్ని మార్కులు వేయొచ్చని ప్ర‌శ్నించారు. వాలంటీర్లు బాగా పనిచేశారని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వరద బాధితులు స‌మాధానం చెప్పారు. 


 

Back to Top