గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ దంప‌తులు

విజయవాడ: గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ దంప‌తుల‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, వైయ‌స్ భార‌తి దంప‌తులు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. సోమ‌వారం సాయంత్రం రాజ్‌భ‌వ‌న్‌కు చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ దంప‌తులు.. గ‌వ‌ర్న‌ర్ దంప‌తుల‌ను క‌లిసి పుష్ప‌గుచ్ఛం, జ్ఞాపిక‌ను అంద‌జేశారు. అనంత‌రం రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై గవర్నర్, సీఎంల మధ్య చ‌ర్చ జ‌రిగింది. 

Back to Top