సంక్రాంతి సంబ‌రాల్లో సీఎం దంప‌తులు

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంప‌తులు సంక్రాంతి వేడుక‌ల్లో పాల్గొన్నారు. సీఎం నివాస స‌మీపంలోని గోశాల‌లో నిర్వ‌హిస్తున్న సంక్రాంతి సంబ‌రాల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ దంప‌తులు హాజ‌ర‌య్యారు. సంప్ర‌దాయ పంచెక‌ట్టుతో గోశాల‌కు చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌.. గోమాత‌కు ప్ర‌త్యేక‌ పూజ‌లు చేశారు. అనంత‌రం డోలు వాయిద్య క‌ళాకారుల విన్యాసాలు, మ‌హిళ‌ల కోలాటాలు, యువ‌తుల నృత్యాలను సీఎం దంప‌తులు తిల‌కించారు. హ‌రిదాసుకు ధాన్యాన్ని, కానుక‌ల‌ను అందించారు. చిన్నారుల‌తో ఫొటోలు దిగారు. ఈ వేడుక‌ల్లో పాల్గొన్న సింగ‌ర్ మంగ్లీ, ఆమె సోద‌రి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిశారు. టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైయ‌స్ఆర్ సీపీ శ్రేణులు, అధికారులు ఈ వేడుక‌ల్లో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్క‌చెల్లెమ్మ‌లు, సోద‌రులు, స్నేహితుల‌కు, అవ్వాతాత‌ల‌కు అంద‌రికీ సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలిపారు. అంద‌రికీ మంచి జ‌ర‌గాల‌ని మ‌న‌సారా కోరుకుంటున్నాన‌ని అన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top