విక్ర‌మ్‌రెడ్డిని అభినందించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌లో ఘ‌న విజ‌యం సాధించిన మేక‌పాటి విక్ర‌మ్‌రెడ్డిని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అభినందించారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను ఎమ్మెల్యే మేక‌పాటి విక్ర‌మ్‌రెడ్డి మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఇటీవ‌ల జ‌రిగిన ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌లో భారీ మెజార్టీతో విజ‌యం సాధించిన మేక‌పాటి విక్ర‌మ్‌రెడ్డి, పార్టీ నేత‌ల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అభినందించారు. ముఖ్య‌మంత్రిని క‌లిసిన వారిలో మంత్రులు కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు ఉన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top