చిన్నారికి సీఎం వైయ‌స్ జగన్‌ దంపతుల ఆశీర్వాదం

వైయ‌స్ఆర్ జిల్లా: సంక్షేమ సారథిగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా నేతగా మన్ననలందుకుంటున్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఆప్తుడిగా మారి చేయూతనందిస్తున్నారు. ప్రజా రంజక పాలనతోపాటు తన వద్దకు వచ్చే అభిమానులను చిరునవ్వుతో పలకరిస్తూ తండ్రిని తలపిస్తున్నారు. ఇక ఇడుపులపాయలో మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైయ‌స్‌ జగన్ పార్టీ కార్యకర్తలు, స్థానికులతో మాట్లాడారు. వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈక్రమంలోనే జ్యోతి అనే మహిళా అభిమాని సీఎం వైయ‌స్ జగన్‌ దంపతులను కలుసుకుని తన బాబును ఆశీర్వదించాలని కోరారు. సీఎం వైయ‌స్‌ జగన్‌, వైయ‌స్‌ భారతి చిన్నారిని చేతుల్లోకి తీసుకుని ఆశీర్వదించారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top