నూతన వధూవరులకు సీఎం వైయస్‌ జగన్‌ ఆశీర్వాదం

వైయస్‌ఆర్‌ జిల్లా: క‌డ‌ప‌లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. క‌డ‌ప‌లో పలు వివాహ వేడుకలను హాజరైన సీఎం వైయస్‌ జగన్‌ నూతన వధూవరులను ఆశీర్వదించారు. 

కడప ఎన్‌జీఓ కాలనీలో  నారపురెడ్డి మౌర్య (ఐఏఎస్) వివాహ వేడుకలకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ హాజ‌ర‌య్యారు. ఇటీవల (14, ఏప్రిల్) నారపురెడ్డి మౌర్య(ఐఏఎస్) వివాహం జ‌రిగింది. నూత‌న వధూవరులు నారపురెడ్డి మౌర్య, సత్యన్నారాయణరెడ్డిలకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించారు. 

అదే విధంగా కడప మేయర్‌ సురేష్‌ బాబు కుమార్తె ఐశ్వర్య వివాహ వేడుకలకు సీఎం వైయస్ జగన్ హాజ‌ర‌య్యారు. వధువు ఐశ్వర్యకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉప ముఖ్యమంత్రి (మైనార్టీ సంక్షేమం) అంజద్‌ బాషా, ఎంపీలు వైయస్ అవినాష్‌రెడ్డి, పి.మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు.

తాజా వీడియోలు

Back to Top