జూన్‌లో అమలు కానున్న పథకాలు

తాడేపల్లి: ఈ ఏడాది జూన్‌లో అమలు కానున్న పథకాలను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. జూన్‌ 8న జగనన్న తోడు పథకం, జూన్‌ 15న వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం, జూన్‌ 22న వైయస్‌ఆర్‌ చేయూత పథకం అమలు చేస్తామని సీఎం వైయస్‌ జగన్‌ తెలిపారు. గ్రామ సచివాలయాల్లో జాబితాలను డిస్‌ప్లే చేసి.. సోషల్‌ ఆడిట్‌ తర్వాత మార్పులు, చేర్పులు చేయాలన్నారు. జూన్‌ 31న పశ్చిమ గోదావరి జిల్లాలో అమూల్‌–ఏపీ పాల ప్రాజెక్ట్‌ ప్రారంభిస్తామని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top