ప్రపంచంతో పోటీ పడాలి.. ఆల్‌ది వెరీ బెస్ట్ 

వేంప‌ల్లి హైస్కూల్‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్  
 

వైయ‌స్ఆర్‌ జిల్లా:  ‘అందరూ బాగా చదవాలి. ఈరోజు మీరు వేసే అడుగులు.. పెద్ద పెద్ద స్కూల్స్‌లో చదివే పిల్లల చదువులకు ఏమాత్రం తీసిపోకూడదు. గొప్పగా చదవాలి. ప్రపంచంతో పోటీ పడాలి’ అని కోరుకుంటూ మరోసారి ఆల్‌ ది వెరీ బెస్ట్ తెలియజేశారు. వైయ‌స్సార్‌ పర్యటనలో భాగంగా.. వేంపల్లిలో బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలను సీఎం వైయ‌స్ జగన్‌ ప్రారంభించారు. దాదాపు రూ.40 కోట్ల వ్యయంతో కూడిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

జిల్లా పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం వేంపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలోనే మోడల్‌ పాఠశాల గుర్తింపు పొందిన వేంపల్లి జెడ్పీ స్కూల్‌కు వెళ్లి.. అక్కడి పిల్లలతో ముఖాముఖి నిర్వహించారు. 

రూ. 15 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వేంపల్లి జెడ్పీ పాఠశాలను సీఎం వైయ‌స్ జగన్‌ ప్రారంభించారు. నాడు-నేడులో భాగంగా.. స్కూల్‌ రూపురేఖలు గతంలో ఎలా ఉండేవో? ఇప్పుడు ఎలా మారాయో.. స్వయంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు చూపించారు సీఎం జగన్‌. అంతేకాదు పిల్లలందరూ బాగా చదవాలని కోరుకుంటూ ఆల్‌ది వెరీ బెస్ట్ తెలియజేశారు.

తాజా వీడియోలు

Back to Top