అవరోధాలన్నీ తొలగించి ప్రాజెక్టు నెలకొల్పాం

బిర్లా గ్రూప్‌ కాస్టిక్‌ సోడా యూనిట్‌ ప్రారంభోత్సవంలో సీఎం వైయస్‌ జ‌గ‌న్‌

భూగర్భ జలాలు కలుషితం కాకుండా ఆధునిక సాంకేతికతతో పరిశ్రమ

గ్రాసిమ్‌ పరిశ్రమ ద్వారా రూ.2700 కోట్ల పెట్టుబడులు

2500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి

పరిశ్రమలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే

ఎన్నికలకు 2 నెలల ముందు గత ప్రభుత్వం గ్రాసిమ్‌ సంస్థకు అప్పగించింది

సమస్యలు పరిష్కరించకుండా సంతకాలు పెడితే సరిపోతుందా..?

మన ప్రభుత్వం వచ్చాక సమస్యలన్నీ అధిగమించాం

131 మందిపై పెట్టిన కేసులన్నీ ఉపసంహరిస్తాం

తూర్పుగోదావరి: గతంలో నెలకొన్న సమస్యలను అధిగమించి, భూగర్భ జలాలు కలుషితం కాకుండా అత్యాధునిక టెక్నాలజీతో బిర్లా గ్రూప్‌ కాస్టిక్‌ సోడా యూనిట్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. బిర్లా గ్రూప్‌ మూడు విడతల్లో రూ.2700 కోట్ల పెట్టుబడితో అనపర్తిలో పరిశ్రమ స్థాపించిందని, దీని ద్వారా 2500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి లభిస్తుందన్నారు. మన ప్రభుత్వం చేసిన చట్టం ద్వారా పరిశ్రమలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే లభించనున్నాయని సీఎం వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బలభద్రాపురంలో ఏర్పాటు చేసిన ఆదిత్య బిర్లా గ్రూపుకు సంబంధించిన గ్రాసిమ్‌ కాస్టిక్‌ సోడా యూనిట్‌ను సీఎం వైయస్‌ జగన్‌ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..

ఇదొక మంచి కార్యక్రమం. ఆదిత్యా బిర్లా గ్రూపు చైర్మన్‌ కుమార మంగళం బిర్లా గురించి నాలుగు మాటలు చెప్పాలంటే.. దాదాపుగా రూ.6లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌తో దేశ వ్యాప్తంగా 1.40 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించి.. మంచి వ్యక్తిగా, మంచి పారిశ్రామికగా నిలిచారు. ఇలాంటి వారు మన ప్రభుత్వం మీద మరింత నమ్మకం చూపిస్తూ అడుగులు ముందుకు వేయడం రాష్ట్రానికి మంచి పరిణామం. 

ఈరోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ప్రాజెక్టు గతం గురించి చూస్తే.. ఈ ప్రాజెక్టు చాలా సంవత్సరాలు నుంచి రకరకాల ఇబ్బందులకు గురైంది. చివరకు ఈ ప్రాజెక్టును గ్రాసిమ్‌ సంస్థ టేకప్‌ చేసి అడుగులు ముందుకువేయించడం చూస్తున్నాం. ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు మాత్రమే అప్పటి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును గ్రాసిమ్‌ సంస్థకు అప్పగిస్తూ సంతకాలు చేసింది. ఆ తరువాత ప్రాజెక్టుకు ఇంతకుముందున్న సమస్య కొనసాగుతూనే ఉన్నాయి. సమస్యలు పరిష్కారం కాకుండా సంతకాలు చేస్తూ పరిశ్రమ రాదు కదా అన్న కనీస ఆలోచన చేయలేదు. 

మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిజంగానే ఇక్కడ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కరిస్తూ పరిశ్రమ నెలకొల్పించగలిగితే.. వేల కోట్ల రూపాయల పెట్టుబడి రావడమే కాకుండా 2500 మందికి ఉద్యోగాలు వస్తాయనే మంచి ఆలోచనతో ఆ సమస్యలను అధిగమించేందుకు అడుగులు ముందుకేశాం. 

గతంలో ప్రజలకు ఉన్న భయాలను.. క్యాపిటివ్‌ థర్మల్‌ ప్లాంట్‌ ఆపరేషన్‌లోకి వస్తే భయాలు ఇంకా ఎక్కువ అవుతాయని, క్యాపిటివ్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ పెట్టకూడదని కన్వీన్స్‌ చేశాం. అది కాకుండా పారిశ్రామ వ్యర్థ పదార్ధాలు, వదిలే నీరు కూడా కలుషితమయ్యే విషయంగా.. స్థానికులు రకరకాల ఆందోళనలు, భయాలు ఉన్న వాతావరణం గతంలో చూశాం. దాన్ని కూడా అధిగమించేందుకు ఏకంటా టెక్నాలజీలో కూడా మార్పులు చేశాం. 

మెరిక్రియ్‌ మెంబరీన్‌ ద్వారా ఉత్పతయ్యే పాత పరిస్థితిని మార్పు చేసి ఎలక్ట్రాలసిస్‌లో ఇంకా మెరుగైన పద్ధతిని క్రోడీకరించి.. పొల్యూషన్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వని పరిస్థితిలోకి అడుగులు ముందుకు వేయించడం జరిగింది. జీరో లిక్విడ్‌ వేస్ట్‌ అనేది కాన్సెప్టు కింద తీసుకొని యాజమాన్యాన్ని ఒప్పించాం. ఇవన్నీ రకరకాల పద్ధతుల్లో రూపొందించాం. ఈ ప్రాజెక్టు ఇక భయాలకు తావిచ్చే పరిస్థితి లేకుండా చేశాం. 75 శాతం ఉద్యోగాలు కూడా స్థానికులకే ఇవ్వాలని చట్టం చేశాం. ఆ చట్టాన్ని వివరించాం. 75 శాతం ఉద్యోగాలు కూడా స్థానికులకు ఇప్పించేలా ఒప్పించాం. ఈ ప్రాజెక్టు వల్ల మంచి జరుగుతుంది. ప్రాజెక్టు నుంచి వచ్చే సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ కూడా చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. గతంలో ప్రాజెక్టుకు సంబంధించి జరిగిన ఆందోళనలో 131 మందిపై పెట్టిన కేసులన్నీ ఉపసంహరిస్తాం. 

దీని వల్ల మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రాజెక్టు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను.  

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top