8 వ తరగతి విద్యార్ధులు, టీచర్లకు ఉచితంగా ట్యాబ్‌లు

బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలో లాంఛనంగా ప్రారంభించిన  సీఎం శ్రీ వైయ‌స్‌ జగన్‌

 బాప‌ట్ల‌:  ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దువుతున్న 8వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు, టీచ‌ర్ల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఉచితంగా ట్యాబ్‌లు పంపిణీ చేశారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ లాంఛనంగా ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా  మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ..

అందరికీ నమస్కారం, సీఎంగారికి జన్మదిన శుభాకాంక్షలు. ముందుగా దేశానికి, జాతికి సంఖ్యాబలం ముఖ్యం కాదు, విద్యావంతులై ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసంతో బతికినప్పుడే ఈ సమాజంలో గౌరవం ఉంటుందన్న అంబేద్కర్‌ గారి ఆలోచనా విధానం, మనిషిని మహాత్మునిగా తీర్చిదిద్దాలంటే చదువు ఒక్కటే మార్గమని సూచించిన మహాత్మా జ్యోతిరావుపూలే గారి ఆలోచనా విధానం, ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైనది విద్య అని చెప్పిన నెల్సన్‌మండేలా ఆలోచనా విధానం, ఇదే బాటలో మన రాష్ట్రంలో పేద పిల్లల తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే ముఖ్యమన్న సీఎంగారి ఆలోచనలు ఇక్కడ విరాజిల్లుతున్నాయి. ఎవరైనా పుట్టిన రోజులు గుళ్ళలో, ఇళ్ళలో చేసుకుంటారు కానీ మీరు చదువులమ్మ తల్లి ఒడిలో ఈ పేద పిల్లల మధ్య చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. పేదవాడు చదవాలంటే పలక ఉంటే బలపం ఉండేది కాదు, చొక్కా ఉంటే నిక్కర్‌ ఉండేది కాదు, బడికి వెళితే తలుపులు, కిటికీలు ఉండేవి కావు, కానీ ఈ రోజు మీరు విద్యకు ప్రాముఖ్యతనిచ్చి నాడు నేడు పేరుతో స్కూల్స్‌ బ్రహ్మండంగా బాగుచేయిస్తున్నారు. ఈ రోజు మా పేదల పిల్లలు కార్పొరేట్‌ చదువులు చదువుతున్నారు. మధ్యాహ్న భోజనం బ్రహ్మండంగా ఉంది, మా తల్లిదండ్రులు అప్పులు చేసి చదివించేవారు, మీరు ఇప్పుడు అమ్మ ఒడి పెట్టారు, విద్యాదీవెన, వసతి దీవెన పెట్టారు, విదేశీ విద్యను అవినీతిమయం చేస్తే మీరు ప్రఖ్యాత యూనివర్శిటీలలో చదువుకునేలా చేస్తున్నారు. మీరు తీసుకొచ్చిన విద్యా సంస్కరణలు నభూతో నభవిష్యత్‌. దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఇలా ఆలోచించలేదు. ఈ రోజు 8 వ తరగతి పిల్లలకు అరచేతిలో ప్రపంచాన్ని చూపేలా ట్యాబులు ఇస్తున్నారు. అన్నా నాలాంటి రాయిని ఈ రాష్ట్రానికి మంత్రిని చేశారు, నేను ధన్యుడిని, జీవితాంతం మీరు మరో అంబేద్కర్‌లా, జ్యోతిరావుపూలేలా పాలించి ఈ పేదలను ఆదుకుంటారని ఆశిస్తున్నాను. మీరు అందరికీ సాయం చేస్తున్నారు, మా వేమూరు నియోజకవర్గంలో అనాదిగా వందల ఏళ్ళుగా రైతులు లంక భూములు పండించుకుంటున్నారు, వాటికి పట్టాలు లేవు, అనేకమంది పట్టాల కోసం ఎదురుచూస్తున్నారు. అంతేకాక మా ప్రాంతంలో బండికోళ్ళలంక నుంచి వోలేరు వరకు ఒక బ్యారేజ్‌ కట్టాలని నిర్ణయం తీసుకున్నారు, తప్పకుండా వెంటనే దాని నిర్మాణ పనులు ప్రారంభిస్తే ఈ రెండు జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి, నన్నపనేని సుగర్స్‌ గతంలో మూతపడింది, ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్ధితి లేదు, వారికి టెర్మినల్‌ బెనిఫిట్స్‌ ఇచ్చి దానిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, ఈ నియోజకవర్గానికి ఒక డిగ్రీ, ఒక పాలిటెక్నిక్‌ కాలేజీలు ఇవ్వాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. 

బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి

అందరికీ నా అభినందనలు. ఈ రోజు కొత్త శకానికి నాంది పలికిన రోజు, సీఎంగారి జన్మదినం రోజు విద్యారంగంలో తీసుకొస్తున్న మార్పులకు ఆ భగవంతుడు మన సీఎంగారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మన విద్యార్ధులు ప్రపంచంలోనే పోటీతత్వంతో నిలదొక్కుకోవాలి. ఇంతమంచి కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్ధులందరికీ నా అభినందనలు. సీఎంగారి ఆలోచనలకు మీరు ఒక దిక్సూచిలా రాబోయే తరాలకు ఆదర్శంగా ఉండాలి. మా జగనన్న హయాంలో నిలదొక్కుకుని మేం భావిభారత పౌరులుగా ఉన్నామని గర్వంగా చెప్పుకునేలా తయారవ్వాలని కోరుకుంటున్నాను. జైహింద్‌. 

సాయి నాగశ్రీ, 8 వ తరగతి విద్యార్ధిని,  జెడ్పీహెచ్‌ఎస్‌ ఐలవరం, వేమూరు నియోజకవర్గం

జగన్‌ మామా హ్యపీ బర్త్‌ డే, విద్యారంగంపై మీరు తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ద చాలా గొప్పగా ఉంది. నేను గడిచిన మూడేళ్ళుగా విద్యా వ్యవస్ధలో మీరు తీసుకుంటున్న మార్పులను ప్రత్యక్షంగా గమనించాను. మేమంతా మీరు సీఎంగా మరిన్ని సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నాం. అమ్మ ఒడి పథకం చాలా మంది పేద, మధ్య తరగతి విద్యార్ధులకు వరంలాంటిది. నాడు నేడు కార్యక్రమం, ఇంగ్లీష్‌ మీడియం, ట్యాబ్‌ల పంపిణీ ఇలా విద్యారంగంలో విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నారు. జగన్‌ మామా ధ్యాంక్యూ. 

సాత్విక, 8 వ తరగతి విద్యార్ధిని, మునిసిపల్‌ గర్ల్స్‌ హైస్కూల్, తెనాలి

జగన్‌ మామా పుట్టినరోజు శుభాకాంక్షలు. మామయ్య మీరు సీఎం అయిన తర్వాత మా విద్యార్ధులకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. వాటిలో నాడు నేడు, అమ్మ ఒడి, విద్యాకానుక, గోరుముద్ద ఇలా ఎన్నో...నాడు నేడులో ప్రతి స్కూల్‌లో అన్నీ ఏర్పాటుచేశారు. అమ్మ ఒడి ద్వారా మా అమ్మ అకౌంట్లో డబ్బు వేయడం ద్వారా మా చదువులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. విద్యాకానుక ద్వారా యూనిఫామ్స్, షూస్, బుక్స్, డిక్షనరీ ఇస్తున్నారు. బుక్స్‌ క్వాలిటీ చాలా బావుంది. మాకు ఏ అనుమానం వచ్చినా డిక్షనరీలో చూసుకుంటున్నాం. పుట్టినరోజు సందర్భంగా మేం మీకు కానుక ఇవ్వాలి కానీ మీరు మాకు ట్యాబ్‌ ఇస్తున్నారు. మీరు మేం ప్రపంచంతో పోటీపడేలా చేస్తున్నారు. మేం బాగా చదువుకుని మీ పేరు నిలబెడతాం జగన్‌ మామయ్య. మా పట్ల మీరు చూపుతున్న ప్రేమకు మేం కృతజ్ఞులం. గోరుముద్ద పథకం ద్వారా రుచికరమైన, పోషకాహారం ఇస్తున్నారు. మేం చాలా ఇష్టంగా తింటున్నాం, ధన్యవాదాలు జగన్‌ మామా...

Back to Top