‘స్పందన’పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష 

సమస్యలను  త్వరితగతిన పరిష్కరించాలి

సమస్యల పరిష్కారంలో ఫోకస్‌ తగ్గితే విశ్వసనీయత దెబ్బతింటుంది

ఉగాది నాటికి ఇంటి స్థలం లేని పేదవాడు ఉండకూడదు

వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 

అమరావతిః ‘స్పందన’ కార్యక్రమంపై సీఎం వైయస్‌ జగన్‌ మంగళవారం  సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లు,ఎస్పీలతో సీఎం  వీడియో కన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
జులై 1 నుంచి 12 వరుకు జిల్లాల వారీగా వచ్చిన వినతి పత్రాలు,వాటి పరిష్కారాలను సమీక్షించారు. వెంటనే పరిష్కారమయ్యే సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో ఫోకస్‌ తగ్గితే విశ్వసనీయత దెబ్బతింటుందని సూచించారు.  ఇప్పటి వరుకు బాగా చేస్తున్నారు..మరింత బాగా చేయాల్సి ఉందని తెలిపారు. 80 శాతం గ్రీవెన్స్‌ సివిల్‌ సప్లై,పెన్షన్లు,ఇళ్లు,పురపాలక,నగరపాలక సంస్థలకు సంబంధించినవి ఉన్నాయన్నారు.

ఎమ్మార్వోలు తీసుకున్న గ్రీవెన్స్‌ను కలెక్టర్,జేసీలు సమీక్షించాలని ఆదేశించారు. వారంలో ఒక రోజు ఎమ్మార్వోలు,స్థానిక అధికారులతో కలెక్టర్లు వీడియో కన్ఫరెన్స్‌ నిర్వహించాలన్నారు. ఉగాది నాటికి ఇంటి స్థలం లేని పేదవాడు ఉండకూడదని తెలిపారు. ప్రభుత్వ భూమి లేకుంటే భూమిని కొనుగోలు చేయాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ నుంచి కంటెన్‌జెన్స్‌ ప్లాన్‌ జిల్లాలకు పంపిస్తున్నామని తెలిపారు.దాని ప్రకారం విత్తనాలు అభ్యత ఉండేలా చూసుకోవాలని సూచించారు.రైతులకు ఇస్తున్న విత్తనాలు,ఎరువులు,పురుగు మందులు పరిశీలించాలన్నారు. గుంటూరు, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో మలేరియా కేసులపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. 

తాజా వీడియోలు

Back to Top