చంద్రబాబు చెబుతాడు..చేయడు.. వైయస్‌ జగన్‌ చెబితే చేస్తారు

వైయస్‌ జగన్‌ను ప్రజలు గుండెల్లో పెట్టుకుంటే రాష్ట్రం దేవాలయమే

దొడ్డిదారిన సీఎం అయిన చంద్రబాబు ఫేక్‌ ముఖ్యమంత్రి

చంద్రబాబు వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయి. ఎన్నికల్లో గెలవలేరు .

చంద్రబా బు ఫ్రస్టేషన్లో ఉన్నారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ అఖండ విజయం సాధిస్తుంది

సినీ నటుడు పోసాని కృష్ణమురళి

  
తాడేపల్లి:  చంద్రబాబు ఎన్నేన్నో అబద్ధాలు చెబుతారని, ఏ ఒక్కటీ కూడా చేయరని, వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చెడితే కచ్చితంగా చేస్తారని సినీ నటుడు పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుంటే ఈ రాష్ట్రాన్ని ఒక దేవాలయంలా తయారు చేస్తారని చెప్పారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

దొడ్డిదారిన సీఎం అయిన చంద్రబాబు ఫేక్‌ ముఖ్యమంత్రి అని అభివర్ణించారు. ప్రతిపక్ష నేత వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయి. ఎన్నికల్లో గెలవలేరు కాబట్టే చంద్రబాబు వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. ఆయన ఫ్రస్టేషన్లో ఉన్నారని చెప్పారు. సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిజాయితీపరుడు కాబట్టే తాను 11 ఏళ్లుగా ఆయన్ను ఫాలో అవుతున్నట్లు చెప్పారు. వైయస్‌ జగన్‌ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన్ను చూస్తున్నానని చెప్పారు. 2014 ఎన్నికల సమయంలో కొందరు కార్యకర్తలు వచ్చి..అన్నా..ఓటర్లకు రూ.1000, రూ.500 చొప్పున డబ్బులు పంచుతున్నారని, మనం కూడా ఎంతో కొంత డబ్బులు ఇద్దామని వైయస్‌ జగన్‌తో అంటే..ఆయన ఏమన్నారో తెలుసా..మనం కూడా డబ్బులు పంపితే..ఇక రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు. ఓటర్లకు డబ్బులు ఇస్తే మనం రాజకీయాల్లో పనికిరామని, మన పార్టీ కూడా రాంగ్‌ రూట్లో వెళ్తుందని ఆ రోజు చెప్పారు. ఆ మాటలు విన్న తరువాత నాకు ఆశ్చర్యమనిపించింది. ఆయనలో ఇంత పరిణితి చెందిన రాజకీయ నాయకుడు ఉన్నాడా అనిపించింది. అలాగే వైయస్‌ జగన్‌ పాదయాత్రలో కూడా తాను పాల్గొన్నాను.

భీమవరం వద్ద నా చేయి పట్టుకొని నడిచారు. అన్నా..వైయస్‌ రాజశేఖరరెడ్డి గారు ఆ రోజు రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చారు. రుణాలు మాఫీ చేశారని, మీరు కూడా కూడా ఇలాంటివి ఏమైనా చేస్తారా? మనం ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంటుందని అన్నాను. ఆ రోజు నాతో అన్నారు. మురళీ..మన రాష్ట్ర బడ్జెట్‌ ఎంతా? మా నాన్న వైయస్‌ఆర్‌ ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వేరు..ఇప్పుడు ఏపీ పరిస్థితి వేరు అన్నారు. చంద్రబాబు ఈ ఐదేళ్లలో చేయాల్సినవి, చేయకూడని అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. అదిస్తా..ఇదిస్తా అని అబద్దాలు చెప్పలేమని ఆ రోజు చెప్పారు. చంద్రబాబు చెబుతాడు..చేయడు. మనం చెబితే చేస్తాం. అదే మనకు, చంద్రబాబుకు మధ్య ఉన్న తేడా మురళీ అని చెప్పారు. ఏమి చేయగలమో అదే చెబుదాం. ఆయన మాటలు విన్న తరువాత..వైయస్‌ జగన్‌ చాలా స్ట్రాంగ్‌ అని నమ్మాను. నేనేదో పదవి కోసమో..ఇంకో దాని కోసమే కాకపట్టలేదు.  ఇలాంటి సుగుణాలు ఉన్న వైయస్‌ జగన్‌ రాజకీయాల్లో ప్రజలకు నిజాలు చెప్పి ముఖ్యమంత్రి అయ్యారు. 

పవన్‌ కళ్యాణ్‌ ఎలాంటి ఫ్రూఫ్‌లేకుండా మాట్లాడుతున్నారంటే ప్రజలు నమ్మడం లేదు. వ్యక్తిగత కక్షతో ఆయన మాట్లాడుతున్నారు. వాజ్‌పేయి కూడా యుద్ధంలో గెలిచిన సమయంలో ఇందిరాగాంధీ వీరనారి అని మెచ్చుకున్నారు.అది రాజకీయమంటే. అది ప్రతిపక్షమంటే. తెలుగు డిక్షనరీలో కూడా చంద్రబాబు మాట్లాడే మాటలు లేవు. ఎవరూ ఏమి చెప్పినా కూడా వినండి. వైయస్‌ జగన్‌ చెప్పేది నిజమని ప్రజలు నమ్మి తమ గుండెల్లో పెట్టుకుంటే ఈ రాష్ట్రాన్ని ఒక దేవాలయంగా చేస్తారని పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు. ∙మున్సిపల్‌ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ అఖండ మెజారిటీతో విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
 

Back to Top