గీత కార్మికుల జీవన కష్టాన్ని మనసుతో చూసిన వైయస్‌ జగన్‌ 

మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక విద్యార్థులకు ఉన్నత చదువులు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఎందరో ఉన్నత చదువులు చదివారు

గీత కార్మికులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎంతో ఉపయోగపడింది

చంద్రబాబు నిర్ణయాలతో పేదలు చాలా ఇబ్బందులు పడ్డారు

తాడేపల్లి: గీత కార్మికుల జీవన కష్టాన్ని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కళ్లతో కాకుండా మనసుతో చూశారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. పాదయాత్రలో గీత కార్మికుల కష్టాలను తెలుసుకొని అధికారంలోకి వచ్చాక కొత్త పాలసీ తెచ్చి వారికి భద్రత కల్పించారని తెలిపారు. చంద్రబాబు హయాంలో విద్యార్థులు చదువుకు దూరమయ్యారని,  వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత విద్యార్థులకు ఉన్నత చదువులు అందుబాటులోకి వచ్చాయన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ గీత కార్మికులకు చేసిన మేలులకు రాష్ట్ర వ్యాప్తంగా వారు కృతజ్ఞతలు, పాలాభిషేకాలు చేస్తున్నారని, ఇలాంటి కార్యక్రమాలు చేసే ప్రభుత్వంలో తాము మంత్రిగా, కార్పొరేషన్‌ చైర్మన్లుగా ఉండటం సంతోషంగా ఉందని మంత్రి చెల్లుబోయిన తెలిపారు. మంగళవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బీసీ ఉప కులాల కార్పొరేషన్‌ చైర్మన్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. 

ముఖ్యమంత్రికి పాలాభిషేకాలు            
        రాష్ట్రంలో కల్లు గీత కార్మికులు గౌడ, శెట్టిబలిజ, శ్రీశైన, యాత, ఈడిగ ఉపకులాలతో పాటు షెడ్యూల్ కులాలు, తెగలవాళ్లు కూడా ఈ వృత్తిమీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీళ్ల జీవన విధానం మెరుగుపడేలా, వారి జీవన భద్రతకు భరోసా కల్పించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు నూతన కల్లు గీత విధానం తెస్తూ, 5.11.2022 న జీవో 693 ద్వారా  కీలక నిర్ణయం తీసుకున్నారు. గీత కార్మికులకు ఏదైనా ప్రమాదం సంభవించి, ప్రాణాలు కోల్పోయినప్పుడు, ఆ కుటుంబాలు రోడ్డునపడకుండా, వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఎక్స్ గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ గొప్ప  నిర్ణయంపై రాష్ట్రంలోని గీత, గీత ఉప కులాలన్నీ ముక్తకంఠంతో హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రిగారి చిత్రపటాలకు పాలాభిషేకాలు, పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించి తమ ఆనందాన్ని తెలియజేశారు. ఈ ప్రభుత్వం బీసీల ఆత్మగౌరవం, ఆత్మాభిమానాన్ని పెంచే విధంగా పనిచేస్తుంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు అన్నింటా  బీసీలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా తనతో పాటు ఐదు గీత ఉప కులాల కార్పొరేషన్లకు చైర్మన్లను ముఖ్యమంత్రి జగన్ గారు నియమించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది.  మా ఐక్యత వల్ల ప్రభుత్వానికి ఇచ్చిన ప్రతిపాదనలు ఫలవంతం అయ్యాయి. గీత వృత్తిలో ఉన్నవారికి ఇంకా కొన్ని సమస్యలను ఉన్నాయి. వాటన్నింటినీ ముఖ్యమంత్రిగారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకుంటాం.  ప్రాంతాలు వేరు అయినా మా అందరి భావం ఒక్కటే. గీత ఉప కులాల వారంతా ముఖ్యమంత్రిగారికి కృతజ్ఞతలు తెలియచేయాలని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది.  ముఖ్యమంత్రి జగన్ గారు గీత కులాల బిడ్డగా.. మా ఇళ్లలో ఆరాధించబడుతున్నారు.

ఫీజు రీయింబర్స్ మెంటుతో బీసీ కులాల్లో ఉన్నత చదువులు
            రాష్ట్రంలో కుల  వృత్తులు ఉన్నవారంతా పలు ప్రాంతాల్లో  పలువిధాలుగా పిలవబడుతున్నా.... మేమంతా ఒకే కుటుంబం. గీత ఉపకులాలు.. శ్రీకాకుళం ప్రాంతంలో శ్రీశైనులుగా, విజయనగరం, విశాఖపట్నంలో యాతలుగా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో శెట్టిబలిజలుగా, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో గౌడలుగా, రాయలసీమ జిల్లాల్లో ఈడిగలుగా పిలవబడతారు. ఈ అయిదు కులాల ప్రధాన వృత్తి గీత.  వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు ముఖ్యమంత్రి కాకముందు, గీత వృత్తిదారుల్లో చదువు పట్ల ఆసక్తి చూపించినవారి సంఖ్య చాలా తక్కువ. ఎందుకంటే వారికి తమ పిల్లలను ఉన్నత చదువులు చదవించే ఆర్థిక స్థోమత లేకపోవడమే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు ఫీజు రీయింబర్స్ మెంట్ పథకానికి రూపకల్పన చేసి, అమలు చేశాక, ముఖ్యంగా బీసీ కులాల్లో లక్షలాది మంది పిల్లలు ఉన్నత చదువులు చదివి, విదేశాలకు వెళ్లారు. ఇటీవల ఓ గీత సోదరుడు వైయస్సార్ గారు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా తన కుమార్తె  డాక్టర్ విద్యను అభ్యసించిందని సంతోషంగా  చెప్పాడు. ఈ కులాలకు వైయస్సార్ గారు ఒక దైవంగా కనిపించారు. 2014-19 కాలంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ పేద విద్యార్ధులకు ఇచ్చే ఫీజు రీయింబర్స్ మెంట్ ను కుదించింది.  పేదలను పేదలుగానే మిగల్చాలని,  బీసీలు ఆత్మ గౌరవంతో బతక కూడదనేలా పాలన చేసిన చంద్రబాబు, వారిని ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే చూశాడు. 
-  వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు అధికారంలోకి వచ్చాక..  విద్యా విధానంలో ఆయన తీసుకువచ్చిన సంస్కరణలు దేశానికే దిక్సూచిగా నిలిచాయి. నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళను అభివృద్ధి చేశారు. గ్రామీణ స్థాయిలోని విద్యార్థులకు పూర్తి మౌలిక సదుపాయాలు కల్పించారు. ఆంగ్ల మాధ్యమంలో బోధనతో పాటు విద్యార్థులకు అమ్మ ఒడి, విద్యా దీవెన, గోరుముద్దు, విద్యా కానుక పథకాల ద్వారా పేద విద్యార్థులకు పూర్తిగా ప్రభుత్వమే అండగా నిలుస్తుంది.  

ప్రతిపక్షాల ఆరోపణల్లో పస లేదు
         ప్రతిపక్షాల ఆరోపణలు అర్థరహితం. టీడీపీ పాలనలో గీత కులాల గురించి కనీసం ఆలోచన చేయలేదు.  మా గురించి మాట్లాడే అర్హతే టీడీపీకి లేదు. బీసీలను చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ మోసం చేశారు. ఓట్లు వేయించుకోవడానికి మాత్రమే మమ్మల్ని వాడుకున్నారు.  రాష్ట్రంలో గీత వృత్తిదారులకు లభిస్తున్న ప్రభుత్వ సహకారం.. మరే ఇతర రాష్ట్రాల్లో లేదు. దేశంలో ఎక్కడా ఎక్స్ గ్రేషియా లక్షకు మించి లేదు. అదే ముఖ్యమంత్రి జగన్ గారు పది లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించడం హర్షనీయం. దీనిపై గీత సహ కులాలు ఐక్యత ను ప్రభుత్వానికి తెలియచేయాలని నిర్ణయించుకున్నారు.

- ఈ మీడియా సమావేశంలో గీత వృత్తిదారులకు సంబంధించిన ఆయా కులాల కార్పొరేషన్ల ఛైర్మన్లు గుబ్బాల తమ్మయ్య(శెట్టి బలిజ), మాదు శివరామకృష్ణ(గౌడ), పిల్లి సుజాత(యాత), కె. సంతు (ఈడిగ) పాల్గొన్నారు. 

Back to Top