చంద్రబాబు అరెస్ట్  ఎందుకు సమర్థనీయం కాదు?

తాడేప‌ల్లి: చంద్రబాబు అరెస్ట్  ఎందుకు సమర్థనీయం కాదని మంత్రి ఆర్కే రోజా ప్ర‌శ్నించారు. స్కిల్‌డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో.. పద్ధతి ప్రకారం చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ జరగలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెగ బాధపడిపోతున్నట్లున్నారు. అందుకే ఎక్స్‌(ట్విటర్‌ వేదికగా) ఆమె ఓ పోస్ట్‌ చేశారు. అయితే.. ఆ పోస్ట్‌కి ఏపీ మంత్రి రోజా కౌంటర్‌ ఇచ్చారు.  
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్ట్ చేస్తే తప్పేంటి..? అని మంత్రి రోజా ప్ర‌శ్నించారు.  ఏపీ సీఐడీ చంద్రబాబుకు ఇచ్చిన నోటీసుల్లోని సెక్షన్ల.. ఏయే నేరాలను అవి వర్తిస్తాయో ప్రస్తావించారు మంత్రి రోజా.  చంద్రబాబు అరెస్ట్  ఎందుకు సమర్థనీయం కాదు? అని పురందేశ్వరిని నిలదీశారామె. అలాగే.. బీజేపీని మీ బావ జనతా పార్టీ గా మార్చేశారంటూ పురంధేశ్వరికి మంత్రి రోజా కౌంటరే ఇచ్చారు.

Back to Top