సీఎం వైయస్‌ జగన్‌ అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం ప్రారంభం

అమరావతి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ సమావేశం కొద్దిసేపటికి క్రితం ప్రారంభమైంది. సచివాలయంలో జరుగుతున్న కేబినెట్‌ సమావేశానికి మంత్రులు హాజరయ్యారు. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా రూ.46 వేల కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటు, మిల్లెట్, పప్పుధాన్యాల బోర్డుల ఏర్పాటు, చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.24 వేల ఆర్థిక సాయం, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు, అమ్మ ఒడి పథకం విధి విధానాలపై, రోబోటిక్‌ ఇసుక తయారీపై, ఇసుక రవాణాకు యువతకు వాహనాల మంజూరు ప్రతిపాదనలపై కేబినెట్‌ సమావేశంలో చర్చించనున్నారు. 
 

Read Also: పైడితల్లికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి బొత్స దంపతులు

తాజా వీడియోలు

Back to Top