రాష్ట్రంలో విద్యా వ్యవస్థ విచ్ఛిన్నం 

30 లక్షల మందికి తల్లులకు  ‘తల్లికి వందనం’ ఎగ్గొట్టారు

మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు  

విజయవాడలో వైయ‌స్ జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం పుస్తకం ఆవిష్క‌ర‌ణ‌

 విజయవాడ: రాష్ట్రంలో విద్యా వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోయింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు మండిప‌డ్డారు. 30 లక్షల మందికి తల్లులకు  తల్లికి వందనం ఎగ్గొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచారని ఘాటు విమర్శలు చేశారు. సోమ‌వారం విజయవాడలో వైయ‌స్ జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం పుస్తకాన్ని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్లు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాలనుఈ పుస్తకంలో వివరించామ‌ని తెలిపారు.  కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచార‌ని ధ్వ‌జ‌మెత్తారు. చంద్రబాబు అధికారం కోసం వైయ‌స్ జగన్ సంక్షేమ పథకాల పేర్లు మార్చార‌ని,  30 లక్షల మందికి తల్లులకు  తల్లికి వందనం ఎగ్గొట్టార‌ని ఆక్షేపించారు. వైజాగ్ ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్ లేరని విద్యార్థులు ధర్నా చేసిన సందర్భాలు ఉన్నాయ‌ని గుర్తు చేశారు.

`చంద్రబాబు 17 వందల కోట్లు పెట్టిన బకాయిలను వైయ‌స్‌ జగన్ తీర్చారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం దారుణం. జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని అందరు చదవాలి. కరెంటు చార్జీల పేరుతో చంద్రబాబు రూ.15 వేల కోట్లు వసూలు చేస్తున్నారు. బుడమేరుతో ముంపు గురైన ప్రజలకు న్యాయం చేసిన పరిస్థితి లేదు. శాతవాహన కళాశాల ను కబ్జాకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. హిందూ దేవాలయాల మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించి వారు దాడి చేస్తున్నారు. సంవత్సరం కాలంలోనే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చింది. లోకేష్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తల్లికి వందనంలో 87 లక్షల మంది తల్లులకు ఇవ్వాలని లెక్కలు ఉన్నాయి. లోకేష్ తనకు తానే సవాల్ విసురుకుంటున్నాడు’ అని అన్నారు.

డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి మాట్లాడుతూ.. `గతంలో వైయ‌స్‌ జగన్‌ బటన్ నొక్కితే హేళనగా మాట్లాడారు. మీరెందుకు బటన్ నొక్కి ప్రజల ఖాతాల్లో నగలు జమ చేయడం లేదు. చంద్రబాబు ఎవరికీ మంచి చేసిన విధానం లేదు. చంద్రబాబు మద్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. వైఎస్‌ జగన్ స్కూల్ డెవలప్మెంట్ కోసం డబ్బులు కేటాయిస్తే హేళన చేశారు. మీరు.. 13 వేలు  తల్లులు ఖాతాలో వేసి మోసం చేశారు. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టండి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. చదువుకునే విద్యార్థులు, రైతులు, మహిళలను చంద్రబాబు మోసం చేశాడు’ అని తెలిపారు. 

Back to Top