విశాఖ: కోటి సంతకాల ఉద్యమ ర్యాలీ విజయవంతమైన తరహాలోనే ఈ నెల 21వ తేదీన జనహృదయనేత, మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పిలుపునిచ్చారు. మంగళవారం విశాఖలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ… ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఏకైక నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని అన్నారు. ఆయన నాయకత్వంలోనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందని స్పష్టం చేశారు. సంచలనాత్మక నిర్ణయాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత జగనన్నకే దక్కుతుందని పేర్కొన్నారు. పేదలు, మధ్యతరగతి సహా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ వైయస్ఆర్‌సీపీనేనని తెలిపారు. మళ్లీ వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా రావాలన్న ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు ప్రతి కార్యకర్త అకుంఠ దీక్షతో పనిచేయాలని పిలుపునిచ్చారు. వాడవాడలా జగనన్న జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ, విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలో పలు సేవా కార్యక్రమాలు, భారీ కేక్ కటింగ్‌లు, సంబరాలు చేపడతామని వాసుపల్లి వెల్లడించారు.