తాడేపల్లి: టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్, ఎన్‌టీవీ సీనియర్ జర్నలిస్ట్ సురేష్‌లను వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్ లో పరామర్శించారు. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ తండ్రి వెల్లలచెరువు సాంబశివరావు మృతి పట్ల వైయస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. రజనీకాంత్‌తో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. సాంబశివరావు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు. ఎన్‌టీవీ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ తండ్రి కోటా వెంకట రామిరెడ్డి మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. సురేష్‌తో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. వెంకట రామిరెడ్డి గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు.