జోజి నగర్‌ బాధితులకు వైయ‌స్‌ జగన్‌ పరామర్శ 

విజయవాడ: భవానీపురం జోజి నగర్‌లో ఇళ్ల కోల్పోయిన బాధిత కుటుంబాలను వైయస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పరామర్శించారు. మొత్తం 42 బాధిత కుటుంబాలు తమ గోడును ఆయనకు చెప్పుకున్నాయి. తమకు జరిగిన అన్యాయాన్ని వివరించడంతో పాటు కూల్చివేతలకు సంబంధించిన ఫొటోలను బాధితులు వైయ‌స్ జ‌గ‌న్‌కు చూపించారు.  

‘‘25 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం. మావన్నీ కూడా పట్టా భూములే. అన్ని అనుమతులున్నాయి. వాటర్‌, కరెంట్‌ బిల్లులు కడుతూ వచ్చాం. మా ఇళ్లను అన్యాయంగా కూల్చేశారు. మమ్మల్ని రోడ్డున పడేశారు..’’ అని వైయ‌స్ జగన్‌ వద్ద బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఇళ్లు కోల్పోయిన బాధితులతో.. ‘‘అధైర్య పడొద్దని.. అండగా ఉంటాం’’ అని ఆయన భరోసా ఇచ్చారు.    వైయ‌స్ జగన్‌ రాకతో ఆ ప్రాంతమంతా కోలాహలం నెలకొంది. ఆయన్ని చూసేందుకు.. ఫొటోలు తీసేందుకు.. సెల్ఫీలు దిగేందుకు.. కరచలనం చేసేందుకు.. భారీగా జనం తరలివచ్చారు. 

Back to Top