మామిడి రైతుల కన్నీళ్లు.. కూటమి ప్రభుత్వానికి కనబడలేదా ?

వైయ‌స్ఆర్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎంసీ విజయానంద రెడ్డి  ఫైర్‌

చిత్తూరు:గిట్టుబాటు ధర లేక మామిడి రైతులు క‌న్నీళ్లు పెట్టుకుంటుంటే కూట‌మి ప్ర‌భుత్వానికి క‌న‌బ‌డ‌టం లేదా అని వైయ‌స్ఆర్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎంసీ విజయానంద రెడ్డి మండిప‌డ్డారు.  రైతులు రోడ్లపైనే అగచాట్లు పడుతుంటే ప్రభుత్వ చర్యలు ఎక్కడ అని ప్ర‌శ్నించారు. వ్యవసాయ మంత్రి జిల్లా పర్యటనకు వచ్చి  కిలోమామిడి ఎనిమిది రూపాయలు కొనుగోలు చేయాలన్న ఆదేశాలు ఎక్కడ అమలు కావ‌డం లేద‌ని, 
రైతులకు గిట్టుబాటు ధర కల్పించి  మేలు చేయకపోతే ఉద్యమాలు చేపడతామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. మంగ‌ళ‌వారం చిత్తూరులో విజ‌యానంద‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..` చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ నాయుడు ప్రోత్బలంతో వారి అనుచరులు ఎమ్మార్వో  తో కుమ్మక్కై వందల పర్మిట్లు తీసుకున్నారు.  గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో మామిడి రైతులకు కేజీ 25 రూపాయలు వరకు ఇచ్చిన సందర్భం ఉంది.  

మామిడి రైతుల బాధ‌లు వ‌ర్ణ‌ణాతీతం
మామిడి రైతుల ఆవేదన, బాధలు వ‌ర్ణణాతీతం. మామిడి రైతుల ఇబ్బందులు కూటమి ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు.  సంవత్సరం కాలం పాటు  శ్రమించి,  అప్పుచేసి పెట్టుబడి పెట్టి మామిడి సాగు చేస్తే.. పంట చేతికి వచ్చే సమయానికి గిట్టుబాటు ధర లేక కొనుగోలు చేసేవారు లేక అన్నదాత కన్నీరు పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిట్ ప్లస్ ఫోర్ పేరుకే చెప్పిన ఎక్కడ అమలు కాలేదు.  చిత్తూరు నియోజకవర్గ గుడిపాల  మండల కేంద్రంలో TASA, RMM, FOOD & INN పరిశ్రమ వద్ద దాదాపు మూడు కిలోమీటర్ల మేర రైతులు మామిడికాయలతో ట్రాక్టర్లలో నాలుగు రోజులుగా వేచి చూస్తున్నా.. ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రభుత్వాలు కనీస స్పందన లేదు. తిండి నీరు లేక రోడ్లపై ఇబ్బందులు పడుతున్న రైతు తీవ్ర అవ‌స్థ‌లు అంతా ఇంత కాదు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి పూర్తి మామిడి పంటను కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలి` అని విజ‌యానంద‌రెడ్డి డిమాండ్ చేశారు.

Back to Top