వైయస్ఆర్ జిల్లా: పులివెందులలో టీడీపీ నేతల అరాచకాన్ని కప్పి పుచ్చేందుకు ఎన్నికల కమిషన్ కంటి తుడుపు చర్య తీసుకుంది. కేవలం రెండు పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే రీ-పోలింగ్‌కి ఆదేశించింది. బుధవారం అచివెల్లి, ఈ.కొత్తపల్లి బూత్‌లలో పోలింగ్‌కు ఏర్పాట్లు చేశారు. అయితే, మొత్తం పోలింగ్ బూత్‌లలో మళ్ళీ రీ-పోలింగ్ నిర్వహించాలని వైయస్ఆర్‌సీపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు కోరినప్పటికీ వారి అభ్యర్థనను ఈసీ పెడచెవిన పెట్టింది. దీంతో రీ పోలింగ్‌ను వైయస్ఆర్‌సీపీ బహిష్కరించింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్‌లో టీడీపీ అరాచకాల కారణంగా వాస్తవ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని, అందువల్ల రీ–పోలింగ్ నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ కడప వైయస్ఆర్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు మంగళవారం లేఖ రాశారు. పోలింగ్ సందర్భంగా టీడీపీ చేసిన అరాచకాలను ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుని వెళ్లారు. 14వ తేదీన ఎన్నికల కౌంటింగ్ నిలిపివేయాలని కోరారు. టీడీపీ గూండాల అరాచకంతో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని వివరించారు.