అడ్వాన్స్‌ హ్యాపీ బర్త్‌ డే సీఎం సార్‌ 

సాగర గర్భం నుంచి సీఎం వైయ‌స్ జగన్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపిన బైరెడ్డి
 
 

 

 విశాఖ  :  ఈ నెల 21న ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జ‌న్మ‌దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ముంద‌స్తుగా శుభాకాంక్ష‌లు వెల్లువెత్తున్నాయి.  రాష్ట్ర శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వినూత్నంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. సాగ‌ర గ‌ర్భంలోకి వెళ్లి అడ్వాన్స్‌ హ్యాపీ బర్త్‌ డే సీఎం సార్ అంటూ ఓ ఫ్ల‌కార్డును ప్ర‌ద‌ర్శించి వైయ‌స్ జ‌గ‌న్‌పై ఉన్న అభిమానాన్ని చాటి చెప్పారు సిద్ధార్థ‌రెడ్డి. లైవ్‌ అడ్వంచర్‌ డైరెక్టర్‌ బలరామ్‌నాయుడుతో కలసి సముద్రంలో 30 అడుగుల లోతు వరకు బైరెడ్డి స్కూబా డైవ్‌ చేశారు.   సముద్ర గర్భంలోకి వెళ్లి అడ్వాన్స్‌ హ్యాపీ బర్త్‌ డే సీఎం సార్‌ అంటూ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 
 

Back to Top