టీడీపీ మోసం చేసింది

వైయస్‌ఆర్‌సీపీలోకి తిరిగి వచ్చిన బుట్టా రేణుక

టీడీపీ విలువలు లేని పార్టీ ..అక్కడ బీసీలకు గౌరవం లేదు

మానసికంగా వేధించారు

వైయస్‌ఆర్‌సీపీలోకి తిరిగి రావడం సంతోషంగా ఉంది

 

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వీడి టీడీపీలో చేరి తప్పు చేశానని, ఆ పార్టీలో ఎన్నో అనుమానాలు భరించానని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక పేర్కొన్నారు. టీడీపీ నన్ను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ వైయస్‌ఆర్‌సీపీలో చేరడం సొంతింటికి వచ్చినంత ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. శనివారం సాయంత్రం బుట్టా రేణుక వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. నాకు ఎక్కడ గౌరవం ఉందో అక్కడే పని చేయాలని నిర్ణయం తీసుకున్నాను. నేను తప్పు చేశాను..అనుభవించాను.

ఇప్పుడు సొంత ఇంటికి వచ్చినంత సంతోషంగా ఉంది. ఈ పార్టీలో ఉన్న పారదర్శకత టీడీపీలో లేదన్నారు. మాటలు మాత్రమే చెబుతారని, క్లారిటీ ఇవ్వరని విమర్శించారు. దాచిపెట్టి మనుషులను మానసికంగా టార్చర్‌ చేశారు. రాజకీయాల్లో కొత్త అయినా కూడా ఎన్నో మార్పులను తేడాలను టీడీపీలో చూశానని చెప్పారు. వైయస్‌ఆర్‌సీపీలో ఉన్న గౌరవంతో తిరిగి వచ్చానన్నారు. నన్ను చంద్రబాబు మోసం చేశారని ఆమె మండిపడ్డారు. మనం ఎక్కడ ఉన్నామో అక్కడ ఉంటేనే గౌరవం ఉంటుందన్నారు. టీడీపీలో ఎన్నో అనుమానాలు భరించానని చెప్పారు. ఈ రోజు చాలా సంతోషంగా ఉందన్నారు. బీసీ పార్టీ అని చంద్రబాబు గొప్పలు చెబుతుంటారని, బీసీల సీటు తీసి అగ్రకులాలకు ఇచ్చారన్నారు. ఉన్న క్యాండిడెట్‌ను తీశారు. మంగళగిరి, కర్నూలు స్థానాల్లో ఉన్న బీసీలను తొలగించి అగ్ర కులాలకు ఇచ్చారన్నారు. కర్నూలు జిల్లాలోని బీసీ స్థానాలను కూడా తొలగించారన్నారు. పార్టీ కోసం పని కోసం శక్తివంచన లేకుండా పని చేస్తానని చెప్పారు. 

 

 

Back to Top