మండలిలో లోకేష్‌కు సవాల్‌ విసిరిన మంత్రి బుగ్గన

అమరావతి: శాసన మండలి సాక్షిగా ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌... టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు సవాల్‌ విసిరారు. నవరత్నాలు అమలు కోసం చర్చిలు, మసీదులు, దేవాలయ భూములు అమ్ముకోవచ్చని ప్రభుత్వం జీవో ఇచ్చిందన్న నారా లోకేష్‌ వ్యాఖ్యలపై మంత్రి బుగ్గన అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వం మసీదులు, చర్చిలు, దేవాలయాల భూములు అమ్ముకోవచ్చని ఎప్పుడూ జీవో జారీ చేయలేదని బుగ్గన స్పష్టం చేశారు. ఆ జీవో ఎక్కడుందో చూపించాలని సవాల్‌ విసిరిన బుగ్గన, కనీసం ఆ జీవో నెంబర్‌ అయినా చెప్పాలన్నారు. జీవో చూపించలేకపోతే సభకు నారా లోకేష్‌ క్షమాపణ చెప్పాలని బుగ్గన డిమాండ్‌ చేశారు. 
 

Back to Top